Breaking News
  • హైదరాబాద్: పోలీసులకు 9 క్వింటాళ్ల బియ్యాన్ని ఉచితంగా అందించిన రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌, కార్యక్రమంలో పాల్గొన్న మేయర్‌ బొంతు రామ్మోహన్‌.
  • కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు. వలస కార్మికులకు కనీస వేతనం చెల్లించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌. పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు. వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు.
  • అన్నార్తుల ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ భోజనం. మధ్యాహ్నం 40 వేల మందికి, రాత్రి పూట 15 వేల మందికి భోజనం. నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యమంటున్న జీహెచ్‌ఎంసీ. ఆరేళ్ల క్రితం 8 కేంద్రాలతో ప్రారంభం, నేడు 150 కేంద్రాలకు విస్తరణ.
  • గాంధీ ఆస్పత్రిలో డాక్టర్లపై దాడి చేయడం సిగ్గుచేటు. డాక్టర్లపై దాడిని ఒవైసీ ఎందుకు ఖండించలేదు. ప్రభుత్వానికి, డాక్టర్లకు సహకరించాలని ఒవైసీ ఎందుకు చెప్పడంలేదు. డాక్టర్లపై దాడి చేస్తే రోగులను అడవుల్లో వదిలిపెట్టాలి -ఎమ్మెల్యే రాజాసింగ్‌.
  • విశాఖలో కరోనా వైరాలజీ ల్యాబ్‌. కేజీహెచ్‌లో ఇకపై కరోనా నిర్ధారణ పరీక్షలు. కాసేపట్లో ప్రారంభించనున్న మంత్రి అవంతి శ్రీనివాస్‌.

ఈ శతాబ్ధానికి కరోనానే అత్యంత ప్రమాదకర వైరస్..ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

The New Virus Detected in China is the third Zoonotic Coronavirus of the Century, ఈ శతాబ్ధానికి కరోనానే అత్యంత ప్రమాదకర వైరస్..ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్19 (కరోనా వైరస్).. ఈ శతాబ్ధంలో అత్యంత ప్రమాదకరమైన వైరస్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. చైనాలో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వెయ్యి మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో నలభై మూడు వేలమంది ప్రస్తుతం ఈ వైరస్‌ సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అంతే కాకుండా.. ఈ వైరస్ 27 దేశాలకు వ్యాపించింది. అయితే విదేశాల్లో పెద్దగా ప్రభావం చూపని ఈ వైరస్.. చైనాను మాత్రం ఓ రేంజ్‌లో వణికిస్తోంది. చైనా తరువాత అమెరికాలోనే ఈ వ్యాధి ప్రభావం చూపినట్టు తెలుస్తోంది.

The New Virus Detected in China is the third Zoonotic Coronavirus of the Century, ఈ శతాబ్ధానికి కరోనానే అత్యంత ప్రమాదకర వైరస్..ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

చైనాలో వ్యాపిస్తున్నఈ కొత్త వైరస్.. కరోనా వైరస్‌ల కుటుంబానికి చెందినదిగా గుర్తించారు. గతంలో ఇలాంటి వైరస్‌లు సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్), మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(మెర్స్) అనే శ్వాసకోస వ్యాధులకు కారణమయ్యాయి. అప్పట్లో సార్స్ వైరస్ బారిన పడ్డ బాధితుల్లో 9 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. మెర్స్ బాధితుల్లో దాదాపు 35 శాతం మంది చనిపోయారు.

The New Virus Detected in China is the third Zoonotic Coronavirus of the Century, ఈ శతాబ్ధానికి కరోనానే అత్యంత ప్రమాదకర వైరస్..ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

చైనా, తైవాన్‌లో విజృంభించిన సార్స్.. ఎఫెక్ట్‌తో 774 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక, 2012లో సౌదీ ఆరేబియాలో జడలువిప్పిన మిడిల్ ఈస్ట్ రెస్పిరెటరీ సిండ్రోమ్ (మెర్స్) వల్ల ప్రపంచవ్యాప్తంగా 850 మందికి పైగా మృత్యువాతపడ్డారు. కాగా.. ఇప్పుడు ఈ కోవిడ్ -19(కరోనా వైరస్) కారణంగా ఇప్పటికే వెయ్యి మందికి పైగా చనిపోయారు. దీంతో ఈ వైరస్‌ ఈ శతాబ్ధంలోనే ప్రమాదకర వైరస్‌ అనిచెప్పుకోవచ్చు. అంతేకాదు.. అన్నింటి కంటే వేగంగా ఈ వైరస్ వ్యాపిస్తోంది.

ఇక ఈ వైరస్ సోకిన వారికి ఎలా చికిత్సచేయాలో అటు వైద్యులకు కూడా స్పష్టంగా తెలియడం లేదు. వారికి ఇదంతా కనిపించని ఓ శత్రువుతో యుద్ధం చేస్తున్నట్లవుతోంది. ఈ వైరస్ ఎఫెక్ట్‌కు గురైన వారంతా.. న్యూమోనియోతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఊపిరితిత్తుల్లో మంటతో అవస్థపడుతున్నారని.. గాలి నుంచి రక్తానికి ఆక్సిజన్ అందించే ఊపిరితిత్తుల్లోని చిన్న చిన్న సంచులన్నీ నీటితో నిండిపోయాయని వైద్యులు గుర్తించారు.

The New Virus Detected in China is the third Zoonotic Coronavirus of the Century, ఈ శతాబ్ధానికి కరోనానే అత్యంత ప్రమాదకర వైరస్..ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

ఇక ఈ వ్యాధి సోకిన వారి లక్షణాలు ఎలా ఉంటున్నాయంటే..

*ఊపిరితిత్తుల్లో మంట
* తీవ్ర జ్వరం
* దగ్గు
* శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది
* కండరాల నొప్పి
* తీవ్రంగా తలనిప్పి
* గొంతులో పుండ్లు..
* గుండె వేగంగా కొట్టుకోవడం
ఈ వింత లక్షణాలతో కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

* తెలియని వారిని తాకకూడదు..
* మనకు తెలియని వారికి దూరంగా ఉండడం బెటర్
* ఇతరుల కళ్లు, నోరు, ముక్కు భాగాలను తాకొద్దు
* అపరిచితులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది
* ఎప్పుడు మాస్క్ ధరించాలి
* ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రంగా కడుగుతూ ఉండాలి
* జంతువులకు వీలైనంత దూరంగా ఉండాలి.

కరోనా లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. నొప్పి, జ్వరం, దగ్గుకు మెడిసిన్ వాడవచ్చు. ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి. అంతేకాదు.. వీలైనంత ఎక్కువగా నీరు తాగుతుండాలి. ముఖ్యంగా ఏమాత్రం అనుమానం వచ్చినా.. వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందే.

Related Tags