టెస్టుల్లో నయా రన్‌ మిషన్ ఆగయా.. కోహ్లీ, స్మిత్‌లకు దీటుగా..

గత సంవత్సరం డిసెంబర్‌లో జరిగిన యాషెస్ సిరీస్ వరకు అతనెవరో ఎవ్వరికీ తెలియదు. రెండు లేదా మూడు అంతర్జాతీయ మ్యాచులు ఆడినా.. అతనికి చెప్పుకోదగ్గ ఛాన్సులు రాలేదు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టాడు. అంచలంచెలుగా తన స్థాయిని పెంచుకుంటూ వచ్చాడు. ఇంకేముంది.. కట్ చేస్తే.. ఇంగ్లాండ్‌లో జరిగిన యాషెస్ సిరీస్‌కు సెలెక్టర్లు అతడ్ని ఎంపిక చేశారు. అయితే టీమ్‌లో అంతర్జాతీయ బ్యాట్స్‌మెన్ ఉండటంతో మొదటి టెస్టుకు చోటు దక్కలేదు. కానీ రెండో టెస్టులో స్టార్ ప్లేయర్ […]

టెస్టుల్లో నయా రన్‌ మిషన్ ఆగయా.. కోహ్లీ, స్మిత్‌లకు దీటుగా..
Follow us

| Edited By: Umakanth Rao

Updated on: Jan 04, 2020 | 11:42 AM

గత సంవత్సరం డిసెంబర్‌లో జరిగిన యాషెస్ సిరీస్ వరకు అతనెవరో ఎవ్వరికీ తెలియదు. రెండు లేదా మూడు అంతర్జాతీయ మ్యాచులు ఆడినా.. అతనికి చెప్పుకోదగ్గ ఛాన్సులు రాలేదు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టాడు. అంచలంచెలుగా తన స్థాయిని పెంచుకుంటూ వచ్చాడు. ఇంకేముంది.. కట్ చేస్తే.. ఇంగ్లాండ్‌లో జరిగిన యాషెస్ సిరీస్‌కు సెలెక్టర్లు అతడ్ని ఎంపిక చేశారు. అయితే టీమ్‌లో అంతర్జాతీయ బ్యాట్స్‌మెన్ ఉండటంతో మొదటి టెస్టుకు చోటు దక్కలేదు. కానీ రెండో టెస్టులో స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ గాయం కారణంగా వైదొలగడంతో టెస్టుల్లో మొదటి కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చాడు. ప్రత్యర్ధులు వేసే బౌన్సర్లను ధీటుగా ఎదుర్కోవడమే కాకుండా జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అతడెవరో కాదు స్టార్ బ్యాట్స్‌మెన్ మార్నస్ లబూషన్..

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్…

రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా టీమ్ ఓటమి అంచుల్లోకి వచ్చేసింది. ఎదురుగా భారీ టార్గెట్ పైగా ఫామ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ అందుబాటులో లేదు. ఓటమి తప్పదని అందరూ భావించారు. అయితే అప్పుడే ఎటువంటి అంచనాలు లేకుండా మార్నస్ లబూషన్ స్మిత్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. జట్టుకు కావాల్సిన పరుగులను చేయడమే కాకుండా.. తొలి అర్ధశతాకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా ఓటమి నుంచి టీమ్‌ను కాపాడాడు.

అచ్చం స్టీవ్ స్మిత్‌లాగే నడవడిక, అద్భుతమైన బ్యాటింగ్‌తో ఫ్యాన్స్‌ను మైమరిపించాడు. జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. వచ్చిన 13 టెస్టుల్లోనే 1000 పరుగులు పూర్తి చేసుకుని వావ్ అనిపించాడు. అంతేకాకుండా గతేడాది జనవరిలో 110 ర్యాంక్‌లో ఉన్న అతడు చివరికి వచ్చేసరికి ఏకంగా టాప్ 5లో నిలిచాడు. అటు సహచర క్రికెటర్లు కూడా లబూషన్‌‌ను పొగిడిన సందర్భాలు కోకొల్లలు. స్టీవ్ స్మిత్‌తోనే ఎక్కువ సేపు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడని ఒకరు అంటే.. స్మిత్ స్టూడెంట్ అంటూ మరొకరు ప్రశంసించారు. స్టీవ్ స్మిత్, కోహ్లీ, రూట్, విలియమ్సన్.. ఇదే కోవలో లబూషన్ టెస్టుల్లోనే మేటి బ్యాట్స్‌మెన్‌గా అనధికాలంలోనే పేరు సంపాదించాడు. ఇక అతను తన ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొత్త సంవత్సరంలో కూడా కంటిన్యూ చేస్తూ.. ఈ ఏడాది తొలి డబుల్ సెంచరీని నమోదు చేసుకున్నాడు.

ఇండియాతో సిరీస్‌కు ఎంపిక…

టెస్టుల్లో బెస్ట్ ప్లేయర్ లబూషన్ ఇది అందరూ ఒప్పుకుంటారు. అయితే ఇండియా పిచ్‌లలో కూడా అదే ఆటతీరును అతడు కొనసాగిస్తే ఎదురే ఉండదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే ఫామ్‌ను గనక అతడు కొనసాగిస్తే తక్కువ సమయంలోనే అగ్రస్థానానికి చేరుకోవడంలో సందేహం లేదని వారి అంచనా. ఏది ఏమైనా అంతర్జాతీయ క్రికెట్‌కు మరో ఆణిముత్యం దొరికిందని చెప్పక తప్పదు.