జాబిలమ్మపై ప్రకంపనలు, ఏం జరిగింది?

‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అంటూ ఓ మూవీలోని పాట ఏమోగానీ.. నిజంగానే చంద్రుడికి కోపం వచ్చింది. కోట్ల సంవత్సరాలకాలంలో దాదాపు 50 మీటర్ల మేర చంద్రుడు పరిమాణం తగ్గిపోయిందని తాజా అధ్యయనంలో తేలింది. దీంతో కారణంగా ఉపరితలంపై ప్రకంపనలు వస్తున్నాయన్నది పరిశోధకుల విశ్లేషణ. భూకంపాల తరహాలో జాబిల్లిపై చంద్రకంపాలు ఏర్పడ్డాయని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో ద్రాక్షపండు ఎండి కిస్‌మిస్‌గా క్రమంలో దానిపై వచ్చే ముడుతల మాదిరిగానే చంద్రుడి ఉపరితలంపై ముడుతలు వస్తున్నట్లు తేలింది.

చంద్రుడు కుంచించుకుపోయేకొద్దీ ఆ పొరలో ముడతలకు బదులు పగుళ్లు ఏర్పడతాయని పరిశోధనలో పాల్గొన్న శాస్ర్తవేత్త థామస్ వాటర్స్ తెలిపారు. ఈ పగుళ్ల ద్వారా చిన్నపాటి లోయలు ఏర్పడుతున్నాయి. ఈ లోయలకు దాదాపు 30 కిలోమీటర్ల వ్యాసంలో ఎక్కువగా ప్రకంపనలు వస్తున్నట్లు తాము గుర్తించామన్నారు. అపోలో యాత్రల సందర్భంగా వ్యోమగాములు చంద్రుడిపై ఉంచిన సైస్మోమీటర్లు ఇప్పటివరకు 28 సార్లు చంద్రకంపాలు నమోదు చేశాయి. రిక్టర్ సూచీపై తీవ్రత 2 నుంచి 5 వరకు వున్నట్టు తేలింది. అలాగే నాసాకు చెందిన ఓ ఉపగ్రహం కూడా తాజా విషయాలను నిర్ధారించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *