రమేష్‌ పౌరసత్వంపై ఆది శ్రీనివాస్‌ కెవియట్‌

చెన్నమనేని రమేష్‌బాబు పౌరసత్వం రద్దు అంశం మరోసారి హైకోర్టుకు చేరింది. భారత సిటిజన్‌షిప్‌కు రమేష్‌ అనర్హుడంటూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై స్పందించిన చెన్నమనేని..తన పౌరసత్వ పరిరక్షణ కోసం మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. తీర్పు కాపీ వచ్చిన తర్వాత న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. ఐతే రమేష్‌ హైకోర్టును ఆశ్రయిస్తే తనకు సమాచారమివ్వాలని  కేవియట్‌ దాఖలు చేశారు ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌. కోర్టులపై తనకు విశ్వాసముందని..మళ్లీ తానే గెలుస్తాననే […]

రమేష్‌ పౌరసత్వంపై ఆది శ్రీనివాస్‌ కెవియట్‌
Follow us

|

Updated on: Nov 21, 2019 | 9:06 PM

చెన్నమనేని రమేష్‌బాబు పౌరసత్వం రద్దు అంశం మరోసారి హైకోర్టుకు చేరింది. భారత సిటిజన్‌షిప్‌కు రమేష్‌ అనర్హుడంటూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై స్పందించిన చెన్నమనేని..తన పౌరసత్వ పరిరక్షణ కోసం మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. తీర్పు కాపీ వచ్చిన తర్వాత న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.

ఐతే రమేష్‌ హైకోర్టును ఆశ్రయిస్తే తనకు సమాచారమివ్వాలని  కేవియట్‌ దాఖలు చేశారు ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌. కోర్టులపై తనకు విశ్వాసముందని..మళ్లీ తానే గెలుస్తాననే నమ్మకముందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నమనేని రమేష్‌ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ 2009 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌. 1993లోనే రమేష్‌ భారత పౌరసత్వం రద్దు చేసుకున్నారని..ఆయన ఎన్నిక చెల్లదంటూ కేంద్ర హోంశాఖతో పాటు హైకోర్టుకూ ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర హోంశాఖ ఓ కమిటీని నియమించి విషయాన్ని తేల్చాలని ఆదేశించింది హైకోర్ట్‌. న్యాయస్థానం ఆదేశాలతో 2010లో టాండన్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించింది హోంశాఖ.

తన తల్లిదండ్రులు స్వాతంత్ర్య సమరమోధులని.. తాను జర్మనీలో విద్యాభ్యాసం చేసి 1993లో ఆ దేశ పౌరసత్వం పొందానని కమిటీ ముందు తన వాదనలు వినిపించారు రమేష్‌.  చెన్నమనేని రమేష్‌ కేసులో అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకున్న కమిటీ…ఆయన పౌరసత్వం చెల్లదని చెప్పింది. దీంతో 2017లో రమేష్‌బాబు పౌరసత్వాన్ని రద్దు చేసిందిహోంశాఖ. దాన్ని సవాల్‌ చేస్తూ రమేష్‌బాబు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఐతే విషయాన్ని తేల్చాల్సింది హోంశాఖేనని స్పష్టం చేస్తూ ఈ ఏడాది జులైలో ఆదేశాలిచ్చింది కోర్టు. హైకోర్ట్‌ఆదేశాలతో 2019 అక్టోబర్‌ 31న ఇరుపక్షాల వాదనలు విన్న కేంద్ర హోంశాఖ..రమేష్‌బాబు పౌరసత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

మరోసారి కోర్టు మెట్లెక్కిన రమేష్‌ పౌరసత్వం

చెన్నమనేని రమేష్‌బాబు పౌరసత్వం రద్దు అంశం మరోసారి హైకోర్టుకు చేరింది. భారత సిటిజన్‌షిప్‌కు రమేష్‌ అనర్హుడంటూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై స్పందించిన చెన్నమనేని..తన పౌరసత్వ పరిరక్షణ కోసం మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తన పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు కొట్టివేయాలని కోరారు. ఐతే అంతకుముందు రమేష్‌ హైకోర్టును ఆశ్రయిస్తే తనకు సమాచారమివ్వాలని కేవియట్‌ దాఖలు చేశారు ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌. కోర్టులపై తనకు విశ్వాసముందని..మళ్లీ తానే గెలుస్తాననే నమ్మకముందన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నమనేని రమేష్‌ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ 2009 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌. 1993లోనే రమేష్‌ భారత పౌరసత్వం రద్దు చేసుకున్నారని..ఆయన ఎన్నిక చెల్లదంటూ కేంద్ర హోంశాఖతో పాటు హైకోర్టుకూ ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర హోంశాఖ ఓ కమిటీని నియమించి విషయాన్ని తేల్చాలని ఆదేశించింది హైకోర్ట్‌. న్యాయస్థానం ఆదేశాలతో 2010లో టాండన్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించింది హోంశాఖ. తన తల్లిదండ్రులు స్వాతంత్ర్య సమరమోధులని.. తాను జర్మనీలో విద్యాభ్యాసం చేసి 1993లో ఆ దేశ పౌరసత్వం పొందానని కమిటీ ముందు తన వాదనలు వినిపించారు రమేష్‌.

చెన్నమనేని రమేష్‌ కేసులో అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకున్న కమిటీ…ఆయన పౌరసత్వం చెల్లదని చెప్పింది. దీంతో 2017లో రమేష్‌బాబు పౌరసత్వాన్ని రద్దు చేసింది హోంశాఖ. దాన్ని సవాల్‌ చేస్తూ రమేష్‌బాబు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఐతే విషయాన్ని తేల్చాల్సింది హోంశాఖేనని స్పష్టం చేస్తూ ఈ ఏడాది జులైలో ఆదేశాలిచ్చింది కోర్టు. హైకోర్ట్‌ ఆదేశాలతో 2019 అక్టోబర్‌ 31న ఇరుపక్షాల వాదనలు విన్న కేంద్ర హోంశాఖ..రమేష్‌బాబు పౌరసత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.