ఈ వేసవిలో నల్లఉప్పు వాడితే ఎన్ని ప్రయోజనాలో..

వేసవిలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం సాధారణంగా శీతలపానీయాలు ఎక్కువగా తీసుకుంటాం. అయితే వాటికి బదులుగా పండ్ల రసాలు లేదా కొబ్బరి నీళ్లు తీసుకుంటే అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. అయితే ఈ పండ్ల రసాలతో కాస్త నల్ల ఉప్పును కలిపి తీసకుంటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. ఈ నల్లఉప్పు ఆయుర్వేదంలో పలు అనారోగ్య సమస్యలను నయం చేసే ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. భార‌తీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఈ న‌ల్ల ఉప్పును […]

ఈ వేసవిలో నల్లఉప్పు వాడితే ఎన్ని ప్రయోజనాలో..
Follow us

| Edited By:

Updated on: May 07, 2019 | 8:10 PM

వేసవిలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం సాధారణంగా శీతలపానీయాలు ఎక్కువగా తీసుకుంటాం. అయితే వాటికి బదులుగా పండ్ల రసాలు లేదా కొబ్బరి నీళ్లు తీసుకుంటే అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. అయితే ఈ పండ్ల రసాలతో కాస్త నల్ల ఉప్పును కలిపి తీసకుంటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. ఈ నల్లఉప్పు ఆయుర్వేదంలో పలు అనారోగ్య సమస్యలను నయం చేసే ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. భార‌తీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఈ న‌ల్ల ఉప్పును వంట‌ల్లో ఉప‌యోగిస్తూ వ‌స్తున్నారు. కానీ ఇప్పుడు దీని వాడ‌కం త‌క్కువైంది. అయితే నిజానికి న‌ల్ల ఉప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. మ‌రి ఈ న‌ల్ల ఉప్పు ఇంకా ఏవిధంగా ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసుకుందాం.

1. మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్య ఉన్న‌వారు న‌ల్ల ఉప్పును రోజు తీసుకుంటే ఆ స‌మ‌స్య నుంచి ఇట్టే బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

2. గ్యాస్ట్రిక్ స‌మస్య‌ల‌తో బాధ‌ప‌డేవారు చిటికెడు న‌ల్ల ఉప్పు తింటే చాలు

3. క‌డుపులో మంట‌, అసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం ఉన్న‌వారు, గుండెల్లో మంట ఉన్న‌వారు న‌ల్ల ఉప్పు తింటే మెరుగైన ఫ‌లితం ఉంటుంది.

4. వేస‌విలో న‌ల్ల ఉప్పును రోజూ వాడ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం ల‌భించడమే కాకుండా.. వేడి చేయ‌కుండా ఉంటుంది.