జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం

Jammu and Kashmir, జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం

జమ్మూకశ్మీర్ పునర్‌విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టే బిల్లును సత్వరమే ఆమోదించేదిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో రాజ్యసభలో ఈ బిల్లు సునాయసంగా గట్టెక్కెంది. అదేవిధంగా ఆర్టికల్‌ 370ను రద్దు చేసే తీర్మానాన్ని కూడా రాజ్యసభ ఆమోదించింది. జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై పెద్దల సభలో డివిజన్‌ పద్ధతిలో ఓటింగ్‌ చేపట్టగా.. అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్డీయే ప్రభుత్వం సంపూర్ణ మెజారిటీతో రాజ్యసభలో ఈ కీలక బిల్లును ఆమోదించుకుంది.

బీజేపీ అంటేనే మండిపడే బీఎస్పీ, ఆప్ మొదలుకొని.. వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్‌, టీడీపీ, బోడోల్యాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ తదితర విపక్ష పార్టీలు కూడా ఈ బిల్లుకు మద్దతు పలికాయి. అయితే, ఈ విషయంలో బీజేపీ మిత్రపక్షం జేడీయూ కేంద్రానికి షాక్‌ ఇవ్వడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *