Breaking News
  • భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌.భారత్‌లో నిన్న 54,736 కరోనా కేసులు నమోదు, 853 మంది మృతి దేశవ్యాప్తంగా 17,50,724కు చేరిన పాజిటివ్‌ కేసులు.భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో 37,364 మంది మృతి.5,67,730 యాక్టివ్‌ కేసులు, ఇప్పటి వరకు 11,45,630 మంది డిశ్చార్జ్.
  • సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసుపై షాకింగ్ నిజాలు అంటూ చెప్పిన డాక్టర్. సుశాంత్ ది ఆత్మహత్య కాదు.అతనిని కొట్టి చంపి .. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించారని రక్షణ శాఖ ఆర్డినెన్స్ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్న మీనాక్షి మిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు . వీడియోలో మృతదేహంపై గాయాలు , పడి ఉన్న తీరును విశ్లేషించిన డాక్టర్. ట్విట్టర్ లో వీడియో ని చూపిస్తూ... చెప్పిన డాక్టర్.
  • చెన్నై: తమిళ సినీ నిర్మాతల మండలి కి వ్యతిరేకం గా భారతి రాజా సంచలన నిర్ణయం . నటుడు విశాల్ ని టార్గెట్ చేస్తూ దర్శకుడు భారతి రాజా ఆధ్వర్యం లో కొత్త నిర్మాతల మండలి ఏర్పాటు . ప్రస్తుత నిర్మాతల మండలి అధ్యక్షుడి గా ఉన్న నటుడు విశాల్ దాదాపు 7 కోట్లకు మేర అవినీతి కి పాల్పడట్టు భారతి రాజా వర్గం ఆరోపణ . తమిళ నిర్మాతలకు సంబంధిచి ఎటువంటి మంచి జరగడం లేదంటూ ,సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలను టార్గెట్ చేస్తూ దోచుకుంటున్నారని ఆరోపణలు.
  • టాలీవుడ్ దర్శకుడు తేజ కు కారోనా పాజిటివ్ గత వారం వెబ్ సిరీస్ షూటింగ్ డైరెక్ట్ చేసిన తేజ యూనిట్ సబ్యులకు, కుటుంబ సభ్యులకు కారోనా టెస్టులు, తేజకు తప్ప అందరికి నెగిటివ్.
  • చెన్నై: అయోధ్య లో రామమందిరం నిర్మాణం ఫై స్పందించిన కంచి పీఠాధిపతి స్వామి విజయేంద్ర సరస్వతి. ఆలయ నిర్మాణం ఫై 1986 నుండి నేటి వరకు ఎన్నో ఇబ్బందులను అధిగమించి నేడు భూమి పూజ నిర్వహించడం చాల శుభపరిణామం . ప్రజలందరూ కులమతాలకు అతీతం గా దేశ భక్తి ,దైవ భక్తి ప్రతిభింబించేలా రామమందిరం నిర్మాణానికి సహకరించాలి .
  • అమరావతి: 3 రాజధానుల బిల్లు ఆమోదంపై హైకోర్టులో మరో పిల్. హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేసిన రాజధాని రైతులు శ్రీనివాసరావు, సాంబశివరావు. అధికార వికేంద్రీకరణ బిల్లుల ఆమోదం సవాలు చేస్తూ ఒక పిటిషన్. సీఆర్డీఏ రద్దు సవాలు చేస్తూ రెండో పిటిషన్. జేఎన్ రావు కమిటీ, హైపవర్ కమిటీ, బోస్టన్ స్. కన్సల్టెన్సీ నివేదికలు, కమిటీలను సవాలు చేస్తూ మూడో పిటిషన్ దాఖలు. రేపు విచారణకు వచ్చే అవకాశాలు. ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన రాజధాని పరిరక్షణ సమితి.

ఈ ఐస్క్రీం ధర రూ. 52,300

A Dubai café is serving a scoop of diamond ice cream, ఈ ఐస్క్రీం ధర రూ. 52,300

ఏ కాలమైనా సరే కప్పులకు కప్పులు ఐస్క్రీంలను లాగించే హిమక్రీముల ప్రియులు చాలామందే ఉంటారు..అలాంటి వారందరికీ ఒక బిగ్ న్యూస్.. దుబాయ్ లోని జుమెయిరా బీచ్ రోడ్‌లో ఉన్న స్కూపీ కెఫేలో ఓ ఐస్క్రీంను లాంచ్ చేసారు.. బ్లాక్ డైమండ్‌గా పిలిచే ఈ ఐస్క్రీం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా వార్తల్లో నిలిచింది. 2,999 ధిరాంలు అంటే మన కరెన్సీలో దాదాపు 52,300 రూపాయలతో కాస్ట్లీయెస్ట్ ఐస్క్రీంగా వైరల్ అయింది.

చూడటానకి బంగారు వర్ణంలో మెరిసిపోతున్నప్పటికీ.. దీనికి బ్లాక్ డైమండ్‌గా నామకరణం చేశారు. ఇక దీని స్పెషాలిటీ గురించి చెప్పుకుంటే, దీన్ని లిక్విడ్ నైట్రోజెన్‌తో తయారు చేస్తారు. అలాగే 23 క్యారట్ల బంగారాన్ని పొడి చేసి ఇందులో కలుపుతారు. మామూలు ఐస్క్రీంలలా ఫ్రీజర్‌లో పెట్టి, అవసరం అయినప్పుడు అమ్మడం కాకుండా, ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా దీన్ని తయారు చేసి ఇస్తారు. మడగాస్కర్ వనీలా ఫ్లేవర్‌ను ఇందులో వాడుతుండగా , ఇరాన్ నుంచి తెప్పించిన అత్యంత ఖరీదైన కుంకుమపువ్వును కూడా అదనపు ఫ్లేవర్ కోసం వినియోగిస్తున్నారు. వెర్సేస్ నుంచి వచ్చిన హ్యాండ్ మేడ్ బౌల్, వెండి స్పూన్‌తో దీన్ని సర్వ్ చేస్తారు. ఈ ఐస్క్రీంని తిన్నాక ఈ బౌల్, స్పూన్లని మీతో పాటు తీసుకువెళ్లవచ్చు అని మంచి ఆఫర్‌ని కూడా ఇస్తున్నారు ఈ కెఫే నిర్వాహకులు. మరి మీరు కూడా ఐస్క్రీం ప్రియులైతే, దుబాయ్ వెళ్లినప్పడు ఈ బ్లాక్ డైమండ్‌ని ట్రై చేసేయండి.

Related Tags