Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

జనసేనానికి విద్యార్థి సంఘాల శవయాత్ర

kurnool students union opposes pawan kalyan, జనసేనానికి విద్యార్థి సంఘాల శవయాత్ర
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కర్నూలు లో శవయాత్ర నిర్వహించారు. నగరంలోని రాజ్ విహర్ సెంటర్ లో రాయలసీమ విద్యార్ది సంఘాల ఆధ్వర్యంలో భారీ ఊరేగింపుతో శవయాత్ర సాగింది. రాయలసీమ ప్రాంతాన్ని దెబ్బ తీసేవిధంగా వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను ఉరేగించి దగ్ధం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు వచ్చిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజధాని కర్నూలు కి కేటాయించాలని చెప్పి ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. రాయలసీమ ప్రాంతానికి నష్టం కలిగించే విధంగా అమరావతి జపం చేస్తున్నారని రాయలసీమ విద్యార్ది సంఘాల నాయకులు మండిపడ్డారు. అమరావతి కోసం ధీక్షను చేపడతామన్న పవన్ కళ్యాణ్ కు రాయలసీమ విద్యార్థులుగా బుద్ధి చెపుతామన్నారు. రాయలసీమ హక్కుల కోసం ఎంతటి పోరాటాలకైన తాము సిద్ధంగా ఉన్నామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు.
kurnool students union opposes pawan kalyan, జనసేనానికి విద్యార్థి సంఘాల శవయాత్ర

Related Tags