హమ్మ‌య్యా…ఆ జ‌ర్న‌లిస్టుల‌కు కరోనా లేద‌ట !

ప్రాణాల‌కు తెగించి విధులు నిర్వ‌హిస్తున్న‌ డాక్ట‌ర్లు, ఆస్ప‌త్రి సిబ్బంది, పోలీసులు, మీడియా ప్ర‌తినిధులు, పారిశుద్ధ్య కార్మికుల‌పైనా క‌రోనా పంజా విసురుతోంది. అయితే, అక్క‌డి జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా వైర‌స్ నెగేటివ్‌గా తేల‌టంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.

హమ్మ‌య్యా...ఆ జ‌ర్న‌లిస్టుల‌కు కరోనా లేద‌ట !
Follow us

|

Updated on: Apr 25, 2020 | 2:05 PM

దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. వీఐపీలు మొద‌లు సామాన్యుల వ‌ర‌కు అంద‌రిపై త‌న ప్ర‌తాపం చూపిస్తోంది. వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వాలు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టీకి క‌రోనా ఉధృతి త‌గ్గ‌టం లేదు. లాక్‌డౌన్ నేప‌థ్యంలోనూ ప్రాణాల‌కు తెగించి విధులు నిర్వ‌హిస్తున్న‌ డాక్ట‌ర్లు, ఆస్ప‌త్రి సిబ్బంది, పోలీసులు, మీడియా ప్ర‌తినిధులు, పారిశుద్ధ్య కార్మికుల‌పైనా క‌రోనా పంజా విసురుతోంది.  అయితే, అక్క‌డి జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా వైర‌స్ నెగేటివ్‌గా తేల‌టంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.
ఈనెల 22న నిర్వ‌హించిన కోవిడ్‌-19 ప‌రీక్ష‌ల్లో జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా వైర‌స్ సోక‌లేద‌ని ఢిల్లీ ప్ర‌భుత్వం తెలిపింది. దాదాపు 160 మంది జ‌ర్న‌లిస్టుల‌ను క‌రోనా అనుమానంతో క్వారంటైన్‌కు త‌ర‌లించారు. ఈక్రమంలోనే ఢిల్లీ ప్ర‌భుత్వం తాజాగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. తాజాగా విడుదలైన ఫ‌లితాల్లో నెగేటివ్‌గా తేలింద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. క్వారంటైన్‌లో గ‌డ‌పుతున్న మీడియా ప్ర‌తినిథుల్లో ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ విభాగాలకు చెందిన‌ జ‌ర్న‌లిస్టులు, ఫొటోగ్రాఫ‌ర్లు, కెమేరామెన్లు ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది.