వ్యవసాయ బిల్లులపై బెంగుళూరులో ‘రైతు గర్జన’

వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ సోమవారం బెంగుళూరులో భారీగా రైతులు ర్యాలీ నిర్వహించారు. వారితో బాటు దళితులు, ఇతర పార్టీల కార్యకర్తలు కూడా వందలాదిగా ఇందులో పాల్గొన్నారు..

వ్యవసాయ బిల్లులపై బెంగుళూరులో 'రైతు గర్జన'
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 21, 2020 | 7:28 PM

వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ సోమవారం బెంగుళూరులో భారీగా రైతులు ర్యాలీ నిర్వహించారు. వారితో బాటు దళితులు, ఇతర పార్టీల కార్యకర్తలు కూడా వందలాదిగా ఇందులో పాల్గొన్నారు. బెంగుళూరు రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ..సిటీలోని ఫ్రీడమ్ పార్క్ వద్ద ముగిసింది. అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్.. ఇది కేవలం పంజాబ్, హర్యానా రైతుల ఆందోళన మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతల ఆందోళన అని అన్నారు. ఈ మోదీ ప్రభుత్వం భారతీయ వ్యవసాయ రంగాన్ని ‘కంపెనీ రాజ్యం’ గా మార్చివేసిందని ఆరోపించారు. రైతులంతా మూకుమ్మడిగా ఈ బిల్లులను ప్రతిఘటించాలని, ఉద్యమించాలని యోగేంద్ర యాదవ్ పిలుపునిచ్చారు.

ఈ బిల్లులను కేవలం కాంగ్రెస్ వంటి పార్టీలే కాదు, అనేక రైతు సంఘాలు కూడా వీటిని వ్యతిరేకిస్తున్నాయి. ప్రధాని ఈ విషయాన్నికూడా  పరిగణనలోకి తీసుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. మరిన్ని రాష్ట్రాలకు రైతుల ఆందోళన విస్తరించడం ఖాయమని యాదవ్ అన్నారు.