Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

ఆవుపై పగ తీర్చుకున్న ఏనుగు!

Cow Killed
చిత్తూరు జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు గ్రామాలు, పంటపొలాలపై దాడి చేసి భారీ నష్టాన్నిమిగిల్చిన ఏనుగులు..ఇప్పుడు మూగ జీవాలపై పగపడుతున్నాయి. జిల్లాలోని గంగవరం మండలం గాంధీనగర్‌లో ఓ ఆవుపై అడవిఏనుగు పగ తీర్చుకుంది. ఈ నెల 2వ తేదీన నోరులేని గోమాతపై ఏనుగు దాడి చేసింది. ఏనుగు దాడిలో ఆవు తీవ్రంగా గాయపడింది. నడుము విరిగి పూర్తిగా లేవలేని స్థితిలో ఆ ఆవు..నేలకే పరిమితమైంది. ఆవు యజమాని దానికి వైద్య చికిత్స లు అందజేస్తూ..ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్నాడు..అలా లేవలేని స్థితిలో కూడా ఆ ఆవు..తన దూడకు రెండు పూటలా పాలిస్తూ..వచ్చింది. ఈ క్రమంలోనే ఆ ఏనుగు మరోసారి ఆవుపై విరుచుకుపడింది. ఏనుగు తన పాదాలతో తొక్కి ఆవు ప్రాణం తీసింది. ఏనుగు ఇలా పగబట్టినట్లుగా రెండుసార్లు ఒకే ఆవుపై దాడి చేయడంతో గ్రామస్తులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామాల  విధ్వంసం సృష్టిస్తున్న ఏనుగుల బెడద తగ్గించాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే పగబడుతున్న గజరాజులు..మనుషులపై కూడా ప్రతాపం చూపిస్తాయని,  తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.
Cow Killed 2