అక్కడ కోతలు లేని జీతాలు..పైగా బోనస్‌లు, ఇంక్రిమెట్లు!

దేశ్యాప్తంగా కరోనా మహమ్మారి జడలు విప్పుకుంటోంది. దీంతో ప్రజలు ఇళ్లనుండి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇటుంటి తరుణంలో నిత్యావసరాలకు ఆన్ లైన్ ద్వారా డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ ఆర్డర్స్ నిత్యావసరాల సరఫరా సంస్థ గ్రోఫర్స్...

అక్కడ కోతలు లేని జీతాలు..పైగా బోనస్‌లు, ఇంక్రిమెట్లు!
Follow us

|

Updated on: Jul 21, 2020 | 3:37 PM

దేశ్యాప్తంగా కరోనా మహమ్మారి జడలు విప్పుకుంటోంది. దీంతో ప్రజలు ఇళ్లనుండి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇటువంటి తరుణంలో నిత్యావసరాలకు ఆన్ లైన్ ద్వారా డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ ఆర్డర్స్ నిత్యావసరాల సరఫరా సంస్థ గ్రోఫర్స్ సైతం తమ సిబ్బందిని పెద్ద సంఖ్యలో పెంచుకుంటూ పోతోంది. అంతేకాదు, వారికి తగిన జీతాలు, ప్రమోషన్లు, బోనస్‌లను ప్రకటిస్తోంది. దీనిని బట్టి చూస్తుంటే కరోనా లాక్‌డౌన్ నుంచి ఎకానమీ త్వరగానే కోలుకుంటున్నట్లుగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న ఏప్రిల్–జూన్ మూడు నెలల కాలంలో వేతన కోతను ప్రకటించిన స్టార్ట‌ప్ కంపెనీలు ఇప్పుడు జీతాలను ప్రీకరోనా స్థాయిలకు తీసుకొచ్చాయి. తిరిగి తమ ఉద్యోగులు, సిబ్బందికి పూర్తి జీతాలను ఇవ్వడం ప్రారంభించినట్టు గ్రోఫర్ ధృవీకరించింది. వ్యాపారాలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయని చెప్పింది. అందువల్ల జూలై1 నుంచి వేతనాలను మళ్లీ సాధారణ స్థాయికి తీసుకొచ్చినట్టు గ్రోఫర్స్ కో ఫౌండర్ అల్బిందర్ ధిండ్సా వెల్లడించారు. ఇక జొమాటో సీఈవో దీపేందర్ గోయల్ కూడా ఉద్యోగులకు పూర్తి జీతాలను చెల్లించనున్నట్లు ప్రకటించారు. అటు, ఆన్‌‌లైన్ ట్రావెల్ ఆపరేటర్ ఇక్సిగో కూడా జీతాలను తిరిగి కోతలు లేకుండా చెల్లించనున్నట్లు తెలిపింది.

జూలై నుంచి శాలరీలను ఫిబ్రవరి నెలలో చెల్లించిన మాదిరిగానే ఇవ్వాలని నిర్ణ‌యించినట్లు..ఇక్సిగో చీఫ్ ఎగ్జిక్యూటీవ్ అలోక్ బాజ్‌పేయి వెల్లడించారు. ఈ సందర్బంగా బాజ్‌పేయి ప్రకటన మేరకు…‘లాక్‌‌డౌన్ ఆంక్షలను ప్రభుత్వం సరళీకరించింది. విమానాలు తిరగడం ప్రారంభమైంది. డిమాండ్ పెరుగుతోంది. మేము అంచనా వేసిన దానికంటే ఎక్కువగానే డిమాండ్ ఉందన్నారు. మరోవైపు స్నాప్‌డీల్ కూడా సుమారు 700 మంది ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ప్రకటిస్తూ…సంస్థ సీఈవో..కునాల్ బహ్ల్ వెల్లడించారు.