త్వరలోనే టాటా కంపెనీకి ‘బిగ్ బాస్కెట్’ .. రెండు కంపెనీల మధ్య చివరికి చేరుకున్న చర్చలు.. రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటన..

ఇండియాలో అతి పెద్ద కొర్పొరేట్ కంపెనీ టాటా గ్రూప్స్ చేతిలోకి అతిపెద్ద ఆన్‌లైన్ కిరాణా ప్లాట్‌ఫామ్ బిగ్ బాస్కెట్ వెళ్లనుందని వార్తలు వస్తున్నాయి.

  • uppula Raju
  • Publish Date - 12:05 pm, Thu, 3 December 20

ఇండియాలో అతి పెద్ద కొర్పొరేట్ కంపెనీ టాటా గ్రూప్స్ చేతిలోకి అతిపెద్ద ఆన్‌లైన్ కిరాణా ప్లాట్‌ఫామ్ బిగ్ బాస్కెట్ వెళ్లనుందని వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే కంపెనీ పెద్దలు అధికారికంగా ఈ విషయాలన్ని వెలువరిస్తారని తెలుస్తోంది. రెండు కంపెనీల మధ్య చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయని అవి చివరి దశకు చేరుకున్నాయని త్వరలోనే రెండు కంపెనీల పెద్దలు అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తారని తెలుస్తోంది.

ఇందులో భాగంగా బిగ్ బాస్కెట్ కంపెనీలో 80 శాతం వాటాను టాటాగ్రూప్ 130 డాలర్లకు పైగా కొనుగోలు చేస్తోందని సమాచారం. బిగ్ బాస్కెట్ మార్కెట్ విలువను బట్టి టాటా గ్రూప్ నిర్ణయం తీసుకోనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు టాటా గ్రూప్ ప్రతినిధి నిరాకరించగా, బిగ్ బాస్కెట్ కూడా స్పందించలేదు. అయితే చైనా అతి పెద్ద కంపెనీ అయిన అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ లిమిటెడ్, పలు అంతర్జాతీయ ఫండ్లు బిగ్ బాస్కెట్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టాయి. ఇటీవల భారత్, చైనా సరిహద్దు గొడవల నేపథ్యంలో మరి టాటాగ్రూప్ ఈ నిర్ణయం తీసుకుంటుందో లేదో వేచి చూడాలి. ఎందుకంటే బిగ్ బాస్కెట్‌లో చైనా కంపెనీ పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఇందుకు భారత ప్రభుత్వం అనుమతి అవసరమవుతుందని పలు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. అంతేకాకుండా టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా గురించి అందరికి తెలిసిందే. ఆయన అన్ని విషయాలు తెలుసుకొనే నిర్ణయం తీసుకుంటారిని టాటా ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.