ఐసీయూలోని యువతిపై రేప్ జరగలేదు, పోలీసులు

గుర్ గావ్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న 21 ఏళ్ళ యువతిపై  గతవారం అత్యాచారం జరిగినట్టు వార్తలు వచ్చాయి.అయితే ఇది నిజం కాదని పోలీసులు తెలిపారు. టీబీతో బాధపడుతున్న ఆమె-తనపై లైంగిక దాడి జరిగినట్టు ఓ నోట్ ను తన తండ్రికి ఇచ్చిందని, తన ఆవేదనను వ్యక్త పరిచేందుకు సంకేతాలు ఇచ్చిందని కూడా ఆ వార్తలు పేర్కొన్నాయి. అయితే ఆరు రోజుల అనంతరం ఆమె స్పృహలోకి వచ్చింది. తనపై అత్యాచారం జరగలేదని ఆమె చెప్పినట్టు […]

ఐసీయూలోని యువతిపై రేప్ జరగలేదు, పోలీసులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 31, 2020 | 9:28 PM

గుర్ గావ్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న 21 ఏళ్ళ యువతిపై  గతవారం అత్యాచారం జరిగినట్టు వార్తలు వచ్చాయి.అయితే ఇది నిజం కాదని పోలీసులు తెలిపారు. టీబీతో బాధపడుతున్న ఆమె-తనపై లైంగిక దాడి జరిగినట్టు ఓ నోట్ ను తన తండ్రికి ఇచ్చిందని, తన ఆవేదనను వ్యక్త పరిచేందుకు సంకేతాలు ఇచ్చిందని కూడా ఆ వార్తలు పేర్కొన్నాయి. అయితే ఆరు రోజుల అనంతరం ఆమె స్పృహలోకి వచ్చింది. తనపై అత్యాచారం జరగలేదని ఆమె చెప్పినట్టు పోలీసులు తెలిపారు. సెక్యూరిటీ కెమెరా ఫుటేజీని చూసిన ఖాకీలు ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడారు. ఆమెపై అఘాయిత్యం జరగలేదని వారు పేర్కొన్నారు. అయితే ఆ యువతి తండ్రి మాత్రం అక్టోబరు  21-27 తేదీల మధ్య తన కుమార్తెపై వికాస్ అనే వ్యక్తి రేప్ చేశాడని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు డైలమాలో పడ్డారు. దర్యాప్తు జరుగుతోంది.