India Vs Australia 2020 : తొలిరోజు మ్యాచ్‌కి ఆ క్యాచ్ హైలెట్.. క్రికెట్ అభిమానుల మన్ననలు పొందుతున్న ఆల్‌రౌండర్..

India Vs Australia 2020 : ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే తొలి టెస్ట్‌లో మొదటి రోజు భారత్ ఆధిపత్యం కనబరిచిన సంగతి తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో

India Vs Australia 2020 : తొలిరోజు మ్యాచ్‌కి ఆ క్యాచ్ హైలెట్.. క్రికెట్ అభిమానుల మన్ననలు పొందుతున్న ఆల్‌రౌండర్..
Follow us

|

Updated on: Dec 27, 2020 | 6:35 AM

India Vs Australia 2020 : ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే తొలి టెస్ట్‌లో మొదటి రోజు భారత్ ఆధిపత్యం కనబరిచిన సంగతి తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను ఇండియా 195 పరుగులకు ఆలౌట్ చేయగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఒక వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. కాగా మొదటి రోజు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పట్టిన క్యాచ్‌ మ్యాచ్‌కు హైలెట్‌గా నిలిచింది.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 10 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్‌ జో బర్న్స్‌(0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్‌ 35 పరుగుల వద్ద మరో ఓపెనర్‌ మాథ్యూవేడ్‌(30; 39 బంతుల్లో 3×4) ఔటయ్యాడు. అశ్విన్‌ వేసిన 12.5 ఓవర్‌కు అతడు షాట్‌ ఆడడంతో బంతి గాల్లోకి లేచింది. వెంటనే స్పందించిన జడేజా ఆ బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే, అదే సమయంలో శుభ్‌మన్‌ గిల్‌ సైతం క్యాచ్‌ పట్టడానికి వచ్చాడు. ఇద్దరూ ఒకరినొకరు ఢీకొట్టుకున్నప్పటికీ.. అప్పటికే జడేజా ఆ బంతిని ఒడిసిపట్టాడు. దీంతో కంగారూల జట్టు రెండో వికెట్‌ కోల్పోయింది. అయితే శుభ్‌మన్ గిల్ బలంగా వచ్చి జడేజాను ఢీ కొట్టినా జడేజా మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా క్యాచ్‌ను ఒడిసి పట్టుకొని అభిమానుల మన్ననలు పొందాడు. దీంతో ఈ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అద్భుత క్యాచ్ పట్టావని జడేజాను అందరు పొగడుతున్నారు.

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..