కాల్వలో పడి ఇద్దరు చిన్నారులతో సహా అమ్మమ్మ మ‌ృతి

పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీటి కాల్వలో పడి ఇద్దరు మృతి చెందగా, వారిని కాపాడే ప్రయత్నంలో మరో వృద్దురాలు ప్రాణాలొదిలింది.

కాల్వలో పడి ఇద్దరు చిన్నారులతో సహా అమ్మమ్మ మ‌ృతి
Follow us

|

Updated on: Jul 21, 2020 | 10:55 PM

పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీటి కాల్వలో పడి ఇద్దరు మృతి చెందగా, వారిని కాపాడే ప్రయత్నంలో మరో వృద్దురాలు ప్రాణాలొదిలింది.

తణుకు పట్టణానికి చెందిన వడ్లమూడి అభిషేక్‌(7), జాన్‌కెల్విన్‌(4) సమీపంలో ఉన్న గోస్తనీ కాలువ వద్దకు స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు నీటిలో పడి మునిగిపోయారు. ఈ క్రమంలో వీరిని రక్షించే ప్రయత్నంలో ఆ చిన్నారుల అమ్మమ్మ మానుకొండ సావిత్రి (60) కాలువలో దిగి నీట మునిగి గల్లంతైంది. దీంతో స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే, సుమారు గంట తర్వాత తణుకు మండలం వీరభద్రపురం సమీపంలో ఉన్న వంతెన వద్ద ఈ ముగ్గురి మృతదేహాలు తేలాయి. విషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న చిన్నారుల తల్లిదండ్రులు రోదనలు స్థానికులను సైతం కంటనీరు పట్టించాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలిద్దరు చనిపోవడంతో వారిని ఓదార్చడం ఎవరివల్ల కాలేకపోయింది. ముగ్గురి మృతదేహాలను వెలికి తీసిస పోలీసులు స్థానిక జిల్లా కేంద్ర ఆస్పత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.