Breaking News
  • నల్గొండ: ధర్మారెడ్డిపల్లి కాల్వను పూర్తిచేసి రైతులకు నీరు ఇవ్వాలి. రైతుల ఆత్మహత్యలలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తేనే సీఎం అని అనిపించుకుంటారు. రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి-కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • కరీంనగర్‌: అల్గునూర్‌ బ్రిడ్జి పైనుంచి పడ్డ కారు. కారులో ప్రయాణిస్తున్న భర్త మృతి, భార్యకు గాయాలు. కాపాడేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌కు గాయాలు. మృతుడు కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌గా గుర్తింపు. కొమురవెళ్లి జాతరకు వెళ్తుండగా ఘటన.
  • సిద్దిపేట: జగదేవపూర్‌లో ఉద్రిక్తత. చైర్మన్‌ పదవి కోసం రెండువర్గాలుగా చీలిన టీఆర్‌ఎస్. ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ. శ్రీనివాస్‌రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం. అడ్డుకున్న పోలీసులు.
  • చెన్నై: విల్లుపురం జిల్లా సెంజిలో అగ్రవర్ణాల దాష్టీకం. పొలాల్లో మల విసర్జన చేశాడని యువకుడిని కొట్టిన అగ్రవర్ణాల పెద్దలు. యువకుడికి తీవ్రగాయాలు, పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. గాయాలతో ఉన్న యువకుడిని ఇంటికి పంపిన పోలీసులు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే యువకుడు మృతి. కుటుంబ సభ్యులు, దళిత సంఘాల ఆందోళన. దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌.
  • బాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో ఐటీ దాడులపై రాజకీయ రచ్చ. వైసీపీ, టీడీపీ పరస్పర విమర్శలు. ట్విట్టర్‌లో చంద్రబాబుపై విజయసాయి ధ్వజం. కౌంటర్‌ ఎటాక్‌ చేసిన టీడీపీ నేతలు. శ్రీనివాస్‌ కమిట్‌మెంట్‌ను మెచ్చుకోవాలి. యజమాని ప్రతి లావాదేవీని డైరీలో రాసుకున్నాడు. దోచుకున్నవి, దొంగ లెక్కలను పర్‌ఫెక్ట్‌గా రికార్డ్‌ చేశాడు-విజయసాయి. దోపిడీదారులు నిప్పుకణికల్లా బిల్డప్‌ ఇస్తుంటారు-విజయసాయి. టీడీపీపై దుష్ప్రచారం చేస్తే చట్టపర చర్యలు-యనమల. ఐటీ దాడులను భూతద్దంలో చూపించారు-యనమల. రూ.2 వేల కోట్ల నగద అని ప్రచారం చేశారు. చంద్రబాబుకు వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలి-యనమల. శ్రీనివాస్‌ ఇంట్లో వేల కోట్లు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేశారు-బుచ్చయ్య. వైవీ సుబ్బారెడ్డి మైనింగ్‌లపై విచారణ చేయాలి-బుచ్చయ్య.

Thanks to Facebook: ఫేస్‌బుక్‌లో నాదే ఫస్ట్ ప్లేస్.. తర్వాత మోదీ.. థ్యాంక్స్ జుకర్‌బెర్గ్ !

Thanks to Facebook, Thanks to Facebook: ఫేస్‌బుక్‌లో నాదే ఫస్ట్ ప్లేస్.. తర్వాత మోదీ.. థ్యాంక్స్ జుకర్‌బెర్గ్ !

ఫేస్‌బుక్‌లో జుకర్‌బెర్గ్ తనను నెం.1 గా, భారత ప్రధాని మోదీని నెం.2 గా పేర్కొనడంపట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది జుకర్ తనకు ఇఛ్చిన గౌరవమని అన్నారు. ‘ఎస్.. నిజానికి నేను రెండువారాల్లో ఇండియాకు వెళ్తున్నాను.. Thanks to Facebook, Thanks to Facebook: ఫేస్‌బుక్‌లో నాదే ఫస్ట్ ప్లేస్.. తర్వాత మోదీ.. థ్యాంక్స్ జుకర్‌బెర్గ్ !నా ఈ పర్యటన కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు. జుకర్‌బెర్గ్‌ని అభినందించారు. ప్రపంచంలోని రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సాన్నిహిత్యాన్ని పెంపొందించేందుకు ట్రంప్, మోదీ  ఇద్దరూ కృషి చేస్తున్న వేళ.. అమెరికా అధినేత పర్యటన పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. తన భార్య మెలనియాతో కలిసి ట్రంప్ ఈ నెల 24-25 తేదీల్లో భారత పర్యటనకు రానున్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాలను సందర్శించనున్నారు. అహ్మదాబాద్ లో ట్రంప్ కు లక్షలాది ప్రజలు స్వాగతం చెప్పవచ్చు. అతి పెద్దదైన మొతేరా క్రికెట్ స్టేడియంలో మోడీ, ట్రంప్ ఉమ్మడిగా ప్రసంగించనున్నారు. అయితే వీరి భేటీ సందర్భంగా భారత-అమెరికా దేశాల మధ్య వాణిజ్య వివాదాలు పరిష్క్రమవుతాయా అన్నది సందేహంగా ఉందని వాణిజ్య వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రంప్ రాక సందర్భంగా అమెరికాతో ఇండియా పరిమితమైన ఒప్పందం కుదుర్చుకోవచ్చునని, ఆ దేశంలో తన పౌల్ట్రీ, డెయిరీ మార్కెట్లను పాక్షికంగా ఓపెన్ చేయవచ్చ్చునని భావిస్తున్నారు.

ప్రపంచంలో పెద్దఎత్తున పాలను ఉత్పత్తి చేసే దేశాలలో ఒకటైన ఇండియా.. 80 మిలియన్ల మంది గ్రామీణ పాల వ్యాపారుల మనుగడను దెబ్బ తీయకుండా చూసేందుకు పాలు, పాల ఉత్పత్తుల దిగుమతులను ప్రభుత్వం తగ్గించింది. తమ దేశ సరకులపై భారత్ సుంకాలు తగ్గించిన పక్షంలో.. తాము కూడా వాణిజ్య సంబంధ ప్రాధాన్యాతలను పునరుధ్ధరించేందుకు ట్రంప్ అంగీకరించవచ్చు. చైనా తరువాత ఇండియాకు అతి పెద్ద ట్రేడ్ పార్ట్ నర్ అమెరికాయే. 2018 లో అమెరికాతో భారత ద్వైపాక్షిక సరకులు, సర్వీసుల వాణిజ్య కార్యకలాపాలు 142.6 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి. అయితే.. 2019 లో ఇండియాకు సంబంధించి అమెరికా 23.2 బిలియన్ డాలర్ల దిగుమతులను నష్టపోయింది.