Chay As Mahesh Babu Fan: మహేష్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడిగా మారనున్న అక్కినేని వారసుడు..?

టాలీవుడ్ లో మళ్ళీ మల్టీస్టారర్ మూవీస్ కు శ్రీకారం చుట్టింది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని చెప్పవచ్చు. దీంతో యంగ్ హీరోలు ఇమేజ్‌ను పక్కన పెట్టి మరో హీరోతో సినిమాలను చేస్తున్నారు. 

Chay As Mahesh Babu Fan: మహేష్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడిగా మారనున్న అక్కినేని వారసుడు..?
Follow us

|

Updated on: Jan 06, 2021 | 8:00 PM

Chay As Mahesh Babu Fan: టాలీవుడ్ లో మళ్ళీ మల్టీస్టారర్ మూవీస్ కు శ్రీకారం చుట్టింది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని చెప్పవచ్చు. దీంతో యంగ్ హీరోలు ఇమేజ్‌ను పక్కన పెట్టి మరో హీరోతో సినిమాలను చేస్తున్నారు.  ఇక చిరంజీవి, నాగార్జున పవన్ కళ్యాణ్ వంటి హీరోలు కొన్ని సినిమాల్లో కామియో పాత్రలు చేస్తూ.. ఆ సినిమాకు మరింత హైప్ తెచ్చారు.. ఇక మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి హీరోలు వేరే హీరోల సినిమాలకు వాయిస్ ఇస్తూ.. ఆ సినిమాపై బజ్ క్రియేట్ చేశారు.

తాజాగా అక్కినేని వారసుడు నాగచైతన్య తాజా సినిమాలో కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ చిన్న పాత్రలో తళుక్కుమని మెరవనున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తుంది.  విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో  చైతు హీరోగా  ‘థాంక్యూ’  మూవీ తెరకెక్కుతుంది. ప్రేక్షకులనాడి తెలిసిన ప్రొడ్యూసర్ గా పేరున్న దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి, అవికా గోర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అబిడ్స్‌లోని రామకృష్ణ సినిమా హాల్‌లో జరుపుకుంటుంది. చైతుపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో  సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడిగా నాగ చైతన్య కనిపించబోతున్నాడని సమాచారం. అలాగే ఈ సినిమాలో మహేశ్‌ కొన్ని నిమిషాలపాటు తళుక్కున మెరవబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. తాజాగా లీకైన ఫోటోలను బట్టి చూస్తే ఇది నిజమనే తెలుస్తోంది. అభిరామ్ పేరు పేరిట, మహేష్ బాబు పోస్టర్లతో థియేటర్ ప్రాంగణంలో బ్యానర్లు ఏర్పాటు చేసిన పోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ సినిమాలో చైతు తొలిసారిగా హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడు. మజిలీ సినిమాలో క్రికెటర్ గా ఆకట్టుకున్న చైతు హాకీ ప్లేయర్ గా కూడా మెప్పిస్తాడని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికే నాగచైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నాడు.

Also Read: టెర్రస్ గార్డెనింగ్ పై నగరవాసుల్లో పెరుగుతున్న ఆసక్తి సేంద్రీయ పద్ధతుల్లో మొక్కల పెంపకం కం