ఏపీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం

ఏపీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1999 నుంచి 2009 వరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. 1983లో టీడీపీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారాయన. తరువాత 1995లో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, 1999లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన తమ్మినేని సీతారాం.. 2014లో వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో బావమరిది రవికుమార్ చేతిలో ఓటమిపాలయ్యారు. తరువాత […]

ఏపీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం
Follow us

| Edited By:

Updated on: Jun 14, 2019 | 1:16 PM

ఏపీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1999 నుంచి 2009 వరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. 1983లో టీడీపీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారాయన. తరువాత 1995లో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, 1999లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన తమ్మినేని సీతారాం.. 2014లో వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో బావమరిది రవికుమార్ చేతిలో ఓటమిపాలయ్యారు. తరువాత 2019 శ్రీకాకుళం జిల్లా అమదాలవలస నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.