కోలీవుడ్ హిట్ దర్శకుడి తో విజయ్..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం అట్లీ కుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాను దీపావళీకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత విజయ్ నటించే కొత్త చిత్రంపై ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ‘తని ఒరువన్’ […]

కోలీవుడ్ హిట్ దర్శకుడి తో విజయ్..!
Follow us

|

Updated on: Mar 13, 2019 | 10:34 AM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం అట్లీ కుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాను దీపావళీకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత విజయ్ నటించే కొత్త చిత్రంపై ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ‘తని ఒరువన్’ డైరెక్టర్ మోహన్ రాజా హీరో విజయ్ కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘వేలాయుధం’ అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ఏది ఏమైనా హీరో విజయ్ మాత్రం వరస పెట్టి స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నాడు.