డబుల్ ‘విజయ్’ ధమాకా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్!
తమిళ స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, విజయ్ ‘సంగ తమిజన్’, ‘బిగిల్’ సినిమాలతో దీపావళికి బాక్స్ ఆఫీస్ మీదకు దండయాత్ర చేయనున్నారు. ఇప్పుడు తాజాగా వెండితెరపై కూడా ఈ ఇద్దరు హీరోలు గొడవ పడనున్నట్లు తెలుస్తోంది. హీరో విజయ్ కొత్త చిత్రంలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్త కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్ర కథను సేతుపతికి వినిపించగా.. తన పాత్ర నచ్చి […]
తమిళ స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, విజయ్ ‘సంగ తమిజన్’, ‘బిగిల్’ సినిమాలతో దీపావళికి బాక్స్ ఆఫీస్ మీదకు దండయాత్ర చేయనున్నారు. ఇప్పుడు తాజాగా వెండితెరపై కూడా ఈ ఇద్దరు హీరోలు గొడవ పడనున్నట్లు తెలుస్తోంది. హీరో విజయ్ కొత్త చిత్రంలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్త కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్ర కథను సేతుపతికి వినిపించగా.. తన పాత్ర నచ్చి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అయితే విజయ్ సేతుపతి ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులో కూడా పలు సినిమాలు నటిస్తుండగా.. ఈ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేస్తాడా లేదా అనేది ప్రశ్నగా మారింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఏది రాలేదు. ఏది ఏమైనా ఈ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ మాత్రం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.
మరోవైపు చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సైరా’ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.