ఎమర్జెన్సీని లక్ష్యపెట్టని థాయ్ నిరసనకారులు, భారీ ర్యాలీ

థాయిలాండ్ లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్సనలు జోరందుకున్నాయి. ప్రధాని ప్రయూత్ చాన్ ఊచా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకాక్ లో వేలాది మంది వీధుల్లో ఆందోళనకు దిగారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఈ ప్రధాని గెలుపు అక్రమమని, ఎన్నికల చట్టాలను తనకు అనుకూలంగా మలచుకున్నారని వీరు ఆరోపిస్తున్నారు. ఆందోళన చేస్తున్న తమ నేతలను పోలీసులు అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీరి నిరసనకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నిన్న […]

ఎమర్జెన్సీని లక్ష్యపెట్టని థాయ్ నిరసనకారులు, భారీ ర్యాలీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 15, 2020 | 5:50 PM

థాయిలాండ్ లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్సనలు జోరందుకున్నాయి. ప్రధాని ప్రయూత్ చాన్ ఊచా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకాక్ లో వేలాది మంది వీధుల్లో ఆందోళనకు దిగారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఈ ప్రధాని గెలుపు అక్రమమని, ఎన్నికల చట్టాలను తనకు అనుకూలంగా మలచుకున్నారని వీరు ఆరోపిస్తున్నారు. ఆందోళన చేస్తున్న తమ నేతలను పోలీసులు అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీరి నిరసనకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నిన్న ఎమర్జెన్సీ విధించింది. అయితే దాన్ని ఖాతరు చేయని ఆందోళనకారులు గురువారం మళ్ళీ భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. అనేకమంది విద్యార్థులు కూడా పోలీసు బ్యారికేడ్లను ఛేదించుకుని ముందుకు కదిలారు.