అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్ర వాదుల గురి.. ఎదుర్కొంటామంటున్న సైన్యం..

అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్రవాదులు మరోసారి గురిపెట్టారు. గత కొన్నేళ్లుగా యాత్రికులను లక్ష్యంగా చేసుకుని దాడులకు యత్నించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. అమర్‌నాథ్‌ యాత్రను అడ్డుకునేందుకు ఉగ్రవాదులు..

అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్ర వాదుల గురి.. ఎదుర్కొంటామంటున్న సైన్యం..
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2020 | 10:44 PM

అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్రవాదులు మరోసారి గురిపెట్టారు. గత కొన్నేళ్లుగా యాత్రికులను లక్ష్యంగా చేసుకుని దాడులకు యత్నించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. అమర్‌నాథ్‌ యాత్రను అడ్డుకునేందుకు ఉగ్రవాదులు అనేకసార్లు దాడులకు యత్నించారు. ఈ క్రమంలో యాత్రకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. భారతసైన్యం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది. ప్రతి ఏడాది మాదిరిగానే.. ఈ సారి కూడా ఉగ్రవాదులు అమర్‌నాథ్‌ యాత్రపై కన్నేశారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ విషయాన్ని భారత ఆర్మీ కూడా ధృవీకరించింది. అయితే అమర్‌నాథ్‌ యాత్ర ప్రశాంతంగా జరిగేలా చూడటానికి సైన్యం రెడీగా ఉందని 9 రాష్ట్రీయ రైఫిల్స్ సెక్టార్ కమాండర్, బ్రిగేడియర్ వి.ఎస్. థాకూర్ తెలిపారు. నేషనల్ హైవే 44పై మార్గ మధ్యలో ఏదో ఓ ప్రాంతంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు స్కెచ్ వేస్తున్నారని తమకు సమాచారం తెలిసిందని తెలిపారు.