యాత్రికులపై “ఉగ్ర”గురి.. పాక్ ఏంచేసిందో తెలిస్తే…!

Amarnath Yatra, యాత్రికులపై “ఉగ్ర”గురి.. పాక్ ఏంచేసిందో తెలిస్తే…!

అమర్‌నాథ్ యాత్ర అర్ధాంతరంగా నిలిచిపోయింది. కశ్మీర్ లోయ నుంచి వెంటనే భక్తులు ఖాళీ చేసేయాలని.. వెంటనే యాత్రికులు స్వస్థలాలకు వెళ్లిపోవాలని జమ్ముకశ్మీర్‌ డీజీపీ ప్రకటించారు. అటు రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ కూడా ఇవే ఆదేశాలను జారీ చేశారు. యాత్ర దారిలో ఉగ్రవాదుల కదలికలను గుర్తించామని..ల్యాండ్‌మైన్లు, ఐఈడీలను స్వాధీనం చేసుకున్నట్లు లెఫ్టినెంట్ కల్నల్ ధిల్లాన్ ప్రకటించారు.

యాత్ర మార్గంలో అమెరికన్ మేడ్ స్నైపర్ రైఫిల్

రెండురోజుల క్రితం అమర్‌నాథ్ యాత్ర మార్గంలో ఐఈడీలు, ల్యాండ్‌మైన్లు, అమెరికన్ మేడ్ స్నైపర్ రైఫిల్ లభ్యమవ్వడం సంచలనం సృష్టించింది. దీంతో భారత ఆర్మీ హై అలర్ట్ ప్రకటించింది. కశ్మీర్‌లో లోయ మొత్తం జల్లెడ పట్టాలని అధికారులను ఆదేశించింది సర్కార్. టెర్రర్ గ్రూపులు లోయలో యథేచ్ఛగా తిరుగుతుండడంతో అలజడి రేగింది. ల్యాండ్‌మైన్లను నిర్వీర్యం చేసి.. ఆయుధాలను, ఐఈడీలను స్వాధీనం చేసుకున్నట్లు లెఫ్టినెంట్ కల్నల్ ధిల్లాన్ తెలిపారు. ఇది పాకిస్థానీ టెర్రరిస్టు గ్రూపులపనే అన్నారు.

Amarnath Yatra, యాత్రికులపై “ఉగ్ర”గురి.. పాక్ ఏంచేసిందో తెలిస్తే…! Amarnath Yatra, యాత్రికులపై “ఉగ్ర”గురి.. పాక్ ఏంచేసిందో తెలిస్తే…!

యాత్రికులపై దాడికి పదిసార్లు ప్రయత్నించారు..

ఇప్పటికే టెర్రరిస్టులు పదిసార్లు దాడికి యత్నించినట్లు కాశ్మీర్ ఐజీ పాని తెలిపారు. మున్నాలాహోరీ, కమ్రాన్, ఉస్మాన్ వంటి ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నామన్నారు. కశ్మీర్‌లో అలజడులు సృష్టించి.. శాంతియుతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందన్నారు ఆ రాష్ట్ర డీజీపీ దిల్బాగ్‌ సింగ్. ఈ సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న అన్ని ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రిని చూపించారు. అయితే ఈ ఐఈడీలు ఎలాంటివో పరిశీలిస్తున్నామని ఆర్మీ తెలిపింది. అయితే ఈ ఐఈడీలు, ల్యాండ్‌మైన్లలో పాకిస్థాన్ యాంటీ పర్సనల్ మైన్ ఆనవాళ్లను గుర్తించారు. అంతేకాదు.. అమెరికాకు చెందిన ఎమ్24 రైఫిల్‌ను కూడా ప్రదర్శించారు.

బలగాల మోహరింపు భద్రత కోసమే కానీ.. ఎలాంటి చర్యలకు దిగబోయేది లేదన్నారు లెఫ్టినెంట్ కల్నల్ ధిల్లాన్. అయితే పాకిస్థాన్ చర్యలకు ప్రతిచర్యలు ఉంటాయని తెలిపారు. పాకిస్థాన్ ఇలానే ఉగ్రవాదులను భారత్ మీదకు వదిలితే.. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *