Breaking News
  • కోసూరి వేణుగోపాల్ పాయింట్స్: ఒళ్లు నొప్పుల కార‌ణంగా సెప్టెంబ‌ర్ 1న గ‌చ్చిబౌలిలోని ప్రైవేట్ హాస్పిట‌ల్లో చేరిన కోసూరి వేణుగోపాల్‌. అదే హాస్పిట‌ల్లో `స‌రైనోడు` సినిమా చేశాన‌ని గుర్తుచేసుకున్న వేణుగోపాల్‌. శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది రావ‌డంతో కోవిడ్ ప‌రీక్ష‌లు చేసిన వైద్యులు. కోవిడ్ అని తేల‌డంతో అక్క‌డే చికిత్స తీసుకున్నారు. ఆ త‌ర్వాత నిమోనియా కూడా మొద‌లైంది. బుధ‌వారం రాత్రి గుండెపోటుతో క‌న్నుమూత‌. ఫుడ్ కార్పొరేష‌న్‌లో ఉండ‌గా ఎక్కువ‌గా నాట‌కాలు వేసిన వేణుగోపాల్‌. మిత్రుల ప్రోత్స‌హంతో సినిమాల్లో ప్ర‌య‌త్నం. అంబేద్క‌ర్ చిత్రంలో తొలిసారి న‌టించిన వేణుగోపాల్‌. ఆయ‌న న‌టించిన ఆఖ‌రి చిత్రం `వ‌కీల్‌సాబ్`. `వ‌కీల్ సాబ్‌`లో వేణుగోపాల్ పార్టు షూటింగ్ పూర్తి. దాదాపు 200 చిత్రాల్లో న‌టించిన వేణుగోపాల్‌. `ఉమ్మ‌డి కుటుంబం` సీరియ‌ల్‌కు గానూ నంది అవార్డు అందుకున్నారు. `ఆడ‌ది`, `రుతురాగాలు`, `మ‌న కుటుంబం`, ఉమ్మ‌డి కుటుంబం` వంటి సీరియ‌ళ్ల‌తో మంచి గుర్తింపు. రాజ‌మౌళి, బోయ‌పాటి సినిమాల్లో ఎక్కువ‌గా క‌నిపించిన వేణుగోపాల్‌. వేణుగోపాల్‌కి ఇద్ద‌రు పిల్ల‌లు. కొడుకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ యు.ఎస్‌లో ఉన్నారు. కుమార్తె ఇక్క‌డే ఉంటున్నారు. ఆయ‌న భార్య బేగంపేట‌లో ఉంటారు. గురువారం హైద‌రాబాద్‌లోని ఈఎస్ఐ స్మ‌శాన వాటిక‌లో అంత్య‌క్రియ‌లు.
  • తిరుమల: కర్ణాటక సత్రం నూతన భవన నిర్మాణాలకు శంఖుస్థాపన చేసిన ఏపీ సీఎం జగన్, కర్ణాటక సీఎం యెడ్యూరప్ప.
  • వరంగల్ : వరంగల్ లో వెలుగుచూస్తున్న కొత్త తరహా మోసాలు. పోలీస్ అధికారుల పేరుతో ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్లు క్రియేట్ చేసి అమాయకులకు ఎరవేస్తున్న కేటుగాళ్ళు. అత్యవసరం ఉందని వారి గూగుల్ పే, ఫోన్ పే అకౌంట్స్ కు కొంతడబ్బు పంపాలని పోలీస్ అధికారుల పేరుతో డబ్బులు గుంజుతున్న కేటుగాళ్ళు. మొన్న మహబూబాబాద్ టౌన్ CI రవికుమార్, నిన్న జనగామ టౌన్ Ci మల్లేష్ పేరిట నకిలీ ఫేస్ బుక్ అకౌంట్. అమాయకులను టార్గెట్ చేసి ఫేస్ బుక్ చాటింగ్ ద్వారా డబ్బులు స్వాహా చేస్తున్న కేటుగాళ్ళు. వారి పేరుతో క్రియేట్ చేసిన నకిలీ ఫేస్ బుక్ అకౌంట్స్ పై సైబర్ క్రైమ్ లో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న పోలీసులు. పోలీసుల పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు.
  • నర్సాపూర్ 112 ఎకరాల కేసులో నోరు మెదపని అడిషనల్ కలెక్టర్ నగేష్. 3 రోజుల కస్టడీ లో ఏసీబీ ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు. బాధితుడి నుండి తీసుకున్న 40 లక్షల రూపాయలు ఎక్కడ దాచరనే ప్రశ్నకు సమాధానం ఇవ్వని నగేష్. బాధితుడి నుండి డబ్బు తీసుకున్న రోజు నగేష్ ఎవరెవరితో మాట్లాడారు అనే అంశం పై నగేష్ సీడీఅర్ పరిశీలిస్తున్న ఏసీబీ . నగేష్ బినామీ జీవన్ గౌడ్ తో గతంలో అడిషనల్ కలెక్టర్ జరిపిన లావా దేవిల పైనా పొంతన లేని సమాధానాలు. నేడు మెదక్ జిల్లా రిటైర్డ్ ఉన్నతాధికారి ఏసీబీ విచారణకు హాజరు అయ్యే అవకాశం . ఆర్డీవో అరుణా, తహశీల్దార్ సత్తార్ ల పాత్ర పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఏసీబీ. ఇప్పటి వరకు లభ్యం కానీ 40 లక్షల లంచం డబ్బు. జూనియర్ అసిస్టెంట్ వాసిం తో అడిషనల్ కలెక్టర్ జరిపిన లావాదేవీల పైనా ఏసీబీ ఆరా. నేడు చివరి రోజు కస్టడీ లో బాగంగా నిందితుల నుండి పూర్తి సమాచరం రాబట్టేందుకు ఏసీబీ ప్రయత్నం.
  • చెన్నై : ప్రముఖ సినీ నటుడు , డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ కి కరోనా నిర్ధారణ . చెన్నై మనపాక్కం లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు. గత వారం డీఎండీకే పార్టీ ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొన్న విజయకాంత్ . తీవ్ర అనారోగ్యం నుండి కోలుకుంటున్న విజయకాంత్ కి ఇప్పుడు కరోనా నిర్ధారణ కావడం తో ఆందోళనలో పార్టీ కార్యకర్తలు .
  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెండో రోజు కొనసాగుతున్న ఏసీబీ సోదాలు. నిన్న ఉదయం ఏసీపీ నర్సింహ రెడ్డి ఇంట్లో మొదలైన ఏసీబీ సోదాలు. 25ప్రాంతాల్లో ఏకకాలం లో సోదాలు చేసిన ఏసీబీ. సుమారు 70కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు. ఇవాళ రెండో రోజు కొనసాగుతున్న ఏసీబీ సోదాలు. నర్సింహ రెడ్డి బినామీ ఇళ్లల్లో కొనసాగుతున్న సోదాలు. నర్సింహ రెడ్డి కి బినామిగా ఉన్న asi సత్యం ఇంట్లో సోదాలు చేస్తున్న ఏసీబీ. భారీగా నగదు స్వాధీనం. ఈ రోజు మధ్యాహ్నం వరకు కొనసాగనున్న సోదాలు. ఇప్పటికే రెండు బ్యాంక్ లాకర్ లను గుర్తించిన అధికారులు. బ్యాంక్ లాకర్ లను ఈ రోజు తెరవనున్న ఏసీబీ. సోదాలు ముగిసే సమయానికి ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం.
  • ఇన్స్టాలో కొత్త లుక్ ని పోస్ట్ చేసిన రామ్ చరణ్. ఆయన చేస్తున్న రెండు చిత్రాల్లో ఈ లుక్ ఎందులో అని అభిమానుల ఆరా... ఆచార్య లుక్ ఇదేనంటూ ఫ్యాన్స్ ట్వీట్ట్స్.

సామాన్య ప్రజలే టార్గెట్‌గా ఉగ్రమూకల గ్రనేడ్ దాడి

, సామాన్య ప్రజలే టార్గెట్‌గా ఉగ్రమూకల గ్రనేడ్ దాడి

జమ్మూలో ఉగ్రమూకలు తెగబడ్డారు. సామాన్య ప్రజలే టార్గెట్‌గా గ్రనేడ్ దాడి చేశారు. ఓ బస్సులో గ్రనేడ్‌లు పేల్చారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఈ ఉగ్రదాడిలో ఎంతమంది చనిపోయారన్నది ఇంకా తెలియరాలేదు. సంఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

అత్యంత రద్దీగా ఉండే జమ్మూలోని బస్టాండ్‌లో ఉగ్రమూకలు గ్రనేడ్లు పేల్చారు. ఆగిఉన్న ఓ బస్సులో ముందుగా పేలుళ్లు సంభవించాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా చెల్లచెదురయ్యారు. ఏం జరిగిందో తెలియక స్థానికులు, వ్యాపారులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఆ వాతావరణమంతా భీతావహంగా మారింది. అనేక మంది గాయపడ్డట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రద్దీ పెద్దగాలేని సమయంలో ఈ ఘటన జరగడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించారు.

, సామాన్య ప్రజలే టార్గెట్‌గా ఉగ్రమూకల గ్రనేడ్ దాడి

Related Tags