ఓట్ల లెక్కింపు వేళ.. ఏపీలో ‘ఉగ్ర’ కలకలం

Terror Attacks, ఓట్ల లెక్కింపు వేళ.. ఏపీలో ‘ఉగ్ర’ కలకలం

కొన్ని గంటల్లో ఏపీలో ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారన్న వార్తలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. పోర్టులే లక్ష్యంగా ఉగ్రదాడులు జరగొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో శ్రీలంక రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ బోటు కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో అటు శ్రీహరికోటలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా శ్రీలంక నుంచి ఉగ్రవాదులు సముద్రమార్గం ద్వారా మొదట తమిళనాడు, ఆ తరువాత ఏపీలోని నెల్లూరుకు చేరుకోవచ్చన్న ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సెక్యురిటీని పెంచారు. అయితే రంజాన్ పవిత్ర మాసంలో సాధారణంగా ఉగ్రవాద కార్యకలాపాలు ప్రధానంగా ఇండియాను టార్గెట్ చేస్తాయని ఈ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఇటీవల ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. పలుచోట్ల వారు పాల్పడిన ఆత్మాహుతి దాడుల్లో 150మందికి పైగా మరణించగా.. వందల మంది గాయపడ్డ విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *