పాకిస్తాన్‌లో ఫైవ్ స్టార్ హోటల్‌పై ఉగ్రదాడి

పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్‌ ప్రాంతం గ్వాదర్‌లో ఉన్న ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఉగ్రవాదులు దాడి చేశారు. ప్రాధమికంగా తెలిసిన సమాచారం మేరకు.. ముగ్గురు టెర్రరిస్టులు హోటల్లో చొరబడినట్టు తెలుస్తోంది. ముగ్గురి వద్ద భారీ ఎత్తున ఆయుధాలు ఉన్నాయని సమాచారం. హోటల్ లోపలి నుంచి బాంబు పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ లాంటి ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్న 12 సంస్థలపై పాకిస్తాన్ నిషేధం విధించింది. అందులో జైషే మహ్మద్ కూడా ఉంది.

ఈ 12 సంస్థలను నిషేధిస్తున్నట్టు ప్రకటించిన కొన్ని గంటల్లోనే టెర్రరిస్ట్ ఎటాక్ జరగింది. ఫైవ్ స్టార్ హోటల్ మీద ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. పోలీసులు హోటల్ బయట మోహరించారు. టెర్రరిస్టులు రాకెట్ లాంచర్లు పట్టుకుని ఉన్నారని, ఆత్మాహుతి కోసం జాకెట్స్ కూడా ధరించారని సమాచారం. హోటల్లోని అందరు అతిథులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేసినట్టు బలోచిస్తాన్ సమాచార శాఖ మంత్రి జహూర్ బిలాడీ చెప్పిట్టు దునియా న్యూస్ వెబ్‌సైట్ పేర్కొంది. టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్టు మంత్రి జహూర్ బిలాడీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *