“వాళ్లు చంద్రుడిపై నుంచి రారు”.. పాక్‌కు షాక్ ఇచ్చిన దేశాలు

Terrorists came jk neighbouring country EUparliamentarian, “వాళ్లు చంద్రుడిపై నుంచి రారు”.. పాక్‌కు షాక్ ఇచ్చిన దేశాలు

సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికపై బలమైన వాదిస్తున్న భారత్‌కు యూరోపియన్ పార్లమెంట్ ప్లీనరీ సంఘీభావం తెలిపింది. జమ్ము కశ్మీర్‌ విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానంపై అంతర్జాతీయ సమాజం హర్షం వ్యక్తం చేసింది. ఉగ్రవాదుల దుశ్చర్యలపై యూరోపియన్ పార్లమెంట్ పలు వ్యాఖ్యాలు చేసింది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, గత కొంత కాలంగా ఇక్కడ చోటుచేసుకుంటున్న ఉగ్రదాడులను గమనిస్తూనే ఉన్నామని పేర్కొంది. ఉగ్రవాదులు చంద్రమండలం నుంచి రారని, సరిహద్దు దేశాలనుంచే ప్రవేశిస్తారంటూ పాక్‌ను ఉద్దేశించి ఆరోపించారు. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా తాము వ్యతిరేకిస్తామంటూ ప్రతినిధులు స్పష్టం చేశారు. బుధవారం బ్రెజిల్‌లో జరిగిన యూరోపియన్ పార్లమెంట్ ప్లీనరీ సమావేశంలో సభ్యులు రిస్జార్డ్ జార్నెకీ, పుల్వియో మార్టుసీఎల్లో ఉగ్రవాదంపై సుధీర్ఘ ప్రసంగం చేశారు. భారత్‌లో జరుగుతున్న ఉగ్రవాద ఘటనల గురించి వింటూనే ఉన్నామని, తాము ఎప్పుడు భారత్‌కు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ పలు విధాలుగా భారత్‌ను దోషిగా నిలిపే ప్రయత్నాలు చేసింది. ఇప్పటికీ చేస్తూనే ఉంది. అయితే పాక్‌కు సహాయం చేస్తాయనుకున్న దేశాలు సైతం వెనక్కి తగ్గడంతో మరింత నిరాశకు గురైంది. కశ్మీర్‌ విషయంలో యుద్ధం కూడా రావచ్చంటూ కవ్విస్తోంది. ఇటువంటి సమయంలో అంతర్జాతీయ సమాజం దాదాపుగా భారత్‌కు తోడుగా నిలవడంతో పాక్ మరింత ఇరుకున పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *