ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కి అయిదున్నర ఏళ్ళ జైలుశిక్ష ?

ఉగ్రవాదులకు నిధులు ఇఛ్చి సహాయపడుతున్నాడన్న ఆరోపణపై ముంబై దాడి కేసు సూత్రధారి హఫీజ్ సయీద్‌కి పాకిస్తాన్.. లాహోర్‌లోని యాంటీ-టెర్రరిజం కోర్టు రెండు కేసుల్లో అయిదున్నర ఏళ్ళ జైలు శిక్ష విధించింది. అయితే 11 ఏళ్ళ జైలు శిక్ష విధించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ రెండు కేసుల్లోనూ రూ. 15 వేల చొప్పున జరిమానాను కూడా కోర్టు విధించింది. ఈ రెండింటిలోనూ శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని కూడా కోర్టు ఉత్తర్వు లిచ్చింది. 2008 లో ముంబై […]

ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కి అయిదున్నర ఏళ్ళ జైలుశిక్ష ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 12, 2020 | 5:54 PM

ఉగ్రవాదులకు నిధులు ఇఛ్చి సహాయపడుతున్నాడన్న ఆరోపణపై ముంబై దాడి కేసు సూత్రధారి హఫీజ్ సయీద్‌కి పాకిస్తాన్.. లాహోర్‌లోని యాంటీ-టెర్రరిజం కోర్టు రెండు కేసుల్లో అయిదున్నర ఏళ్ళ జైలు శిక్ష విధించింది. అయితే 11 ఏళ్ళ జైలు శిక్ష విధించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ రెండు కేసుల్లోనూ రూ. 15 వేల చొప్పున జరిమానాను కూడా కోర్టు విధించింది. ఈ రెండింటిలోనూ శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని కూడా కోర్టు ఉత్తర్వు లిచ్చింది.

2008 లో ముంబై పేలుళ్ల దాడిలో ఆరుగురు అమెరికన్లతో సహా 166 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. హఫీజ్ సయీద్ నేతృత్వంలోని ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్-దావాయే ఈ దాడికి కారణమని కోర్టు పేర్కొంది. ఇతనిపై లాహోర్‌లోను, గుజ్రాన్ వాలా నగరంలోనూ కేసులు నమోదయ్యాయి. పంజాబ్ పోలీసు శాఖకు చెందిన కౌంటర్ టెర్రరిజం విభాగం దాఖలు చేసిన పిటిషన్ ను పురస్కరించుకుని కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇతడిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని భారత్-అమెరికా దేశాలు పాకిస్థాన్ ను కోరుతూ వచ్చాయి. గత మార్చిలో జమాత్-ఉద్-దావాను, ఇతర ఉగ్రవాద సంస్థలను పాక్ నిషేధించింది. సయీద్ మీద 10 మిలియన్ యుఎస్ డాలర్ల రివార్డ్ ఉంది.