ఆ బ్యాచ్‌లో ఒక్కరు కూడా లేరు.. ఉగ్ర సంస్థను మట్టుబెట్టిన ఆర్మీ

గత కొద్ది రోజులుగా నిత్యం కశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో.. చిన్న చిన్న ఉగ్ర సంస్థలన్నీ కనుమరుగవుతున్నాయి. టాప్ టెర్రిరిస్టులే లక్ష్యంగా భారత ఆర్మీ చేపడుతున్న ఆపరేషన్‌లో ఇప్పటికే కరుడుగట్టిన ఉగ్రవాదులు హతమయ్యారు. తాజాగా భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ టెర్రర్‌లో భాగంగా.. మంగళవారం అవంతిపొరాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరంతా అన్సర్‌ ఘజ్వతుల్‌ హింద్‌(ఏజీహెచ్‌) అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. […]

ఆ బ్యాచ్‌లో ఒక్కరు కూడా లేరు.. ఉగ్ర సంస్థను మట్టుబెట్టిన ఆర్మీ
Follow us

| Edited By:

Updated on: Oct 25, 2019 | 12:28 AM

గత కొద్ది రోజులుగా నిత్యం కశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో.. చిన్న చిన్న ఉగ్ర సంస్థలన్నీ కనుమరుగవుతున్నాయి. టాప్ టెర్రిరిస్టులే లక్ష్యంగా భారత ఆర్మీ చేపడుతున్న ఆపరేషన్‌లో ఇప్పటికే కరుడుగట్టిన ఉగ్రవాదులు హతమయ్యారు. తాజాగా భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ టెర్రర్‌లో భాగంగా.. మంగళవారం అవంతిపొరాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరంతా అన్సర్‌ ఘజ్వతుల్‌ హింద్‌(ఏజీహెచ్‌) అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. వీరిలో అబ్దుల్‌ హమీద్‌ లెల్హరీ ఈ సంస్థను లీడ్ చేస్తున్నట్లు జమ్మూకశ్మీర్‌ డీజీపీ దిల్‌బాగ్‌సింగ్‌ తెలిపారు. ఈ ముగ్గురి మృతితో ఈ సంస్థ మొత్తం తుడుచుకుపోయిందన్నారు.

అబ్దుల్‌ హమీద్‌ లెల్హరీ ప్రస్తుతం అల్‌ఖైదాతో అనుబంధంగా ఉంటూ.. ఏజీహెచ్‌ను ముందుకు నడుపుతున్నాడు. అంతేకాదు.. ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురు ఉగ్రవాదులు.. అటు జైషే మహ్మద్‌తో కూడా సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిపారు. గతంలో మోస్ట్ వాంటెడ్‌ టెర్రరిస్ట్ జకీర్‌ ముసాను మట్టుబెట్టిన తర్వాత.. ఈ ఏజీహెచ్‌కు హమీద్ నాయకత్వం వహిస్తున్నాడని.. 2016లో ఉగ్ర కార్యకలాపాలు ప్రారంభించిన హమీద్‌.. పలు ఉగ్ర దాడుల్లో పాల్గొన్నాడని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్లో ఎక్కువ మంది యువత ఉగ్రవాదం వైపు వెళ్తారని కొందరు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ… ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని డీజీపీ దిల్ బాగ్‌సింగ్ తెలిపారు. స్థానిక యువత తమకు సహకరిస్తే జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని మట్టుబెడతామన్నారు.