బెంగళూరులో ఉగ్రవాది అరెస్ట్

బెంగళూరులో ఓ మసీదులో దాక్కున్న అనుమానిత ఉగ్రవాదిని చాకచక్యంగా అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. పక్కా సమాచారంతో నగర శివారులో ఉన్న దొడ్డ బల్లాపూర్‌లో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం హబీబుర్ రెహమాన్‌ జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ అనే ఉగ్రవాద సంస్థ సభ్యుడుగా అనుమానిస్తున్నారు. రెహమాన్‌ను సోమవారం అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు ధ్రువీకరించాయి. అయితే మరికొంతమంది కూడా ఈ ప్రాంతంలో తలదాచుకుని ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు […]

బెంగళూరులో ఉగ్రవాది అరెస్ట్
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2019 | 10:03 PM

బెంగళూరులో ఓ మసీదులో దాక్కున్న అనుమానిత ఉగ్రవాదిని చాకచక్యంగా అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. పక్కా సమాచారంతో నగర శివారులో ఉన్న దొడ్డ బల్లాపూర్‌లో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం హబీబుర్ రెహమాన్‌ జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ అనే ఉగ్రవాద సంస్థ సభ్యుడుగా అనుమానిస్తున్నారు. రెహమాన్‌ను సోమవారం అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు ధ్రువీకరించాయి. అయితే మరికొంతమంది కూడా ఈ ప్రాంతంలో తలదాచుకుని ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గత ఐదు రోజులుగా స్ధానికంగా ఉన్న ఓ మసీదులో దాక్కున్న రెహమాన్‌ను ఎన్ఐఏ కోల్‌కతా, కర్ణాటక బృందాలు సంయుక్తంగా అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. బుర్ద్వాన్ పేలుళ్ళ కేసు, బుద్ధ గయ పేలుళ్ళ కేసుల్లో రెహమాన్ నిందితుడు. బుర్ద్వాన్ పేలుళ్ళ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులు కాగా వీరిలో ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే ఎన్‌ఐఏ అదుపులో ఉన్న రెహమాన్‌ను స్థానిక మేజిస్ట్రేట్ సమక్షంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారంట్‌పై కోల్‌కతా ఎన్ఐఏ కస్టడీకి తరలించారు. గత ఐదురోజులుగా ఉగ్రవాది రెహ్మాన్ స్ధానిక మసీదులో ఆశ్రయం పొందడంపై స్ధానికులు భయాందోళనకు గురయ్యారు.