తిరుమలలో ఉగ్రవాదులు.. రంగంలోకి ఆక్టోపస్ బృందం

Terror threat to Tirumala Temple, తిరుమలలో ఉగ్రవాదులు.. రంగంలోకి ఆక్టోపస్ బృందం

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు మరోసారి హెచ్చరించాయి. దీంతో తిరుమల కొండపై భద్రతలను కట్టుదిట్టం చేశారు అధికారులు. మరోవైపు తిరుమలలోకి ఉగ్రవాదులు ప్రవేశించారన్న అనుమానంతో ఆక్టోబస్ బృందం రంగంలోకి దిగింది. మొత్తం 40 మంది కమాండోలు తిరుమలను అడుగడుగున జల్లెడ పడుతున్నారు. ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో కఠోర శిక్షణ పొందిన వీరు అత్యాధునిక ఆయుధాలు, టెక్నాలజీతో తనిఖీలు చేస్తున్నాయి. కొండపై అణువణువునాపెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి.

ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆలయ పరిసరాలతో పాటు తిరుమల మొత్తం కమాండోలు తిరుగుతున్నారు. బృందాలుగా విడిపోయి, అనుమానం వచ్చిన ప్రతి ప్రాంతాన్ని తనిఖీ చేస్తున్నారు. ఆలయం వద్ద నిరంతరం నిఘా ఉంచుతున్నారు. అయితే దేశంలోని పలు ప్రాంతాల్లోకి ఉగ్రవాదులు ప్రవేశించారని ఇంటిలిజెన్స్ వర్గాలు ఇదివరకే హెచ్చరించాయి. పలు ప్రాంతాల్లో పొంచి ఉన్న టెర్రరిస్ట్‌లు ఉగ్రదాడులు చేసేందుకు సిద్ధమయ్యారని వారు కేంద్రానికి తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో కేంద్ర భద్రతా బలగాలు, రాష్ర్ట బలగాలు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *