శ్రీహరి కోటలో హై అలర్ట్.. ఉగ్రవాదుల దూకుడుకు బ్రేక్..!

Terror Alert At Sriharikota, శ్రీహరి కోటలో హై అలర్ట్.. ఉగ్రవాదుల దూకుడుకు బ్రేక్..!

శ్రీహరి కోటలో హై అలర్ట్ విధించారు. సముద్ర మార్గాల నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రవేశించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ మేరకు సముద్ర తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం- శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేర్ సెంటర్ పై దాడి చేసేందుకు ఉగ్రవాదులు రెడీ అయ్యారని తెలిసింది. దాంతో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం భద్రతబలగాలు తీర ప్రాంతాల్లో అణువణువు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తీరంలో పడవలపై నిఘా పెట్టారు. చంద్రయాన్ 2 ప్రయోగం జరిగినప్పటి నుంచి షాక్‌కి శాస్త్రవేత్తలు తరచూ వచ్చి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీహరి కోటను నాశనం చేస్తే.. ఇస్రోకి నష్టం వాటిల్లుతుందని ఉగ్రవాదులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలా చేయడం వల్ల ఇండియాకి తీరని లోటు అవుతుందని ఉగ్రవాదులు ప్లాన్ వేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదుల దూకుడుకు బ్రేక్ వేయాలని.. వారికి ఛాన్స్ ఇవ్వకుండా అడవుల్ని జల్లెడ పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *