బెజవాడలో వైభవంగా దుర్గమ్మ తెప్పోత్సవం

విజయవాడలో కనకదుర్గమ్మ వారి తెప్పోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నది ఉద్ధృతి అధికంగా ఉండటంతో..

బెజవాడలో వైభవంగా దుర్గమ్మ తెప్పోత్సవం
Follow us

|

Updated on: Oct 25, 2020 | 8:39 PM

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఆఖరి ఘట్టంగా కనకదుర్గమ్మ వారి తెప్పోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నది ఉద్ధృతి అధికంగా ఉండటంతో.. నదిలో జలవిహారం లేకుండానే తెప్పోత్సవం చేశారు. హంసవాహనంపై ఉత్సవ మూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హంసవాహనంపైకి దశల వారీగా మొత్తం 80 మందిని మాత్రమే అవకాశం కల్పించారు. పూజా కార్యక్రమాలు చూసేందుకు ప్రకాశం బ్యారేజ్‌ నుంచి మాత్రమే అనుమతినిచ్చారు.   పున్నమిఘాట్, దుర్గాఘాట్ పైవంతెన నుంచి తిలకించేందుకు అనుమతి నిరాకరించారు. దుర్గా ఘాట్‌లో కృష్ణమ్మకు నిర్వహించిన హారతులు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

Also Read :

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..రేపట్నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ

విశాఖ వాసులకు గుడ్ న్యూస్..మెట్రో రైలు వచ్చేస్తుంది