Breaking News
  • హైదరాబాద్: జర్నలిస్టులందరికీ హెల్త్‌ కార్డులు అందించాలి, అన్ని ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఈనెల 20 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు టీయూడబ్ల్యూజే వినతి పత్రాలు-టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ.
  • ఆసియాలోనే లైఫ్‌ సైన్సెస్‌కు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ మారింది. ప్రపంచ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో మూడో వంతు హైదరాబాద్‌ సరఫరా చేస్తోంది. జాతీయ ఫార్మా ఉత్పత్తిలో హైదరాబాద్‌ వాటా 35శాతం-మంత్రి కేటీఆర్‌.
  • యాదాద్రి: గుండాల మండలం సుద్దాల దగ్గర ప్రమాదం, కారు, బైక్‌ ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు.
  • విజయవాడ: ఎమ్మార్వో వనజాక్షిపై టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు, తమను కులం పేరుతో దూషించిందని ఫిర్యాదు చేసిన మహిళా రైతులు.
  • మహబూబాబాద్: పోడు భూముల ఆక్రమణదారులకు కలెక్టర్‌ హెచ్చరిక. 10 ఎకరాలకు మించి పోడు భూములు ఆక్రమించిన 119 మంది. ఆక్రమణదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, నేతలు, కుల సంఘాల నేతలు. భూములు వెంటనే తిరిగి అప్పగించాలని కలెక్టర్ ఆదేశం. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిక.
  • ప్రాణం తీసిన సెల్ఫీ. కృష్ణాజిల్లా: నూజివీడులో విషాదం. సూరంపల్లి కాలువ దగ్గర సెల్ఫీ దిగేందుకు యువకుడు యత్నం. ప్రమాదవశాత్తు కాలువలో పడి యువకుడు మృతి. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న పవన్‌.

కన్నుల పండువగా సాగిన తెప్పోత్సవం

Teppotsavam celebrations kanaka durga temple vijayawada, కన్నుల పండువగా సాగిన తెప్పోత్సవం

కృష్ణానదిలో దుర్గామల్లేశ్వరాస్వామి వార్లు విహరించారు. విజయదశమి సందర్భంగా కృష్ణా నదిలో నిర్వహించిన తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. విద్యుత్ దీపాలతో అలంకరించిన హంస వాహనంపై స్వామి, అమ్మవార్లు విహరించారు. తెప్పోత్సవాన్ని కన్నులారా తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు కృష్ణానది ఒడ్డకు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దంపతులు, దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దంపతులు, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ దంపతులు, కృష్ణా జిల్లా కలెక్టర్ మధవీలత, దుర్గ గుడి ఈవో సురేశ్‌బాబు పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం సుమారు గంటన్నరపాటు ఈ కార్యక్రమం ఆహ్లాదంగా సాగింది.   మరోవైపు ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. మధ్యాహ్నం ఆలయ అర్చకులు పూర్ణాహుతిని నిర్వహించి ఉత్సవాలను సాంప్రదాయబద్దంగా ముగించారు.