చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ

Tension situation at Chandragiri's Kammapalli, చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం NR కమ్మపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు గ్రామాల్లో రీపోలింగ్ పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తొలిదశలో ఎన్నికలు జరిగితే తుదిదశలో ఎన్నికలు నిర్వహించడమేంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్‌ఆర్ కమ్మపల్లికి వెళ్లారు. విషయం తెలుసుకున్న టీడపీ అభర్థి పులివర్తి నాని కూడా గ్రామానికి వచ్చారు. దీంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు.

వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ గ్రామానికి వెళ్లడంతోనే గొడవ ప్రారంభమైంది. ఓటమి భయంతోనే చెవిరెడ్డి రీపోలింగ్ పెట్టించారని.. గ్రామంలోకి రానీయకుండా గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న చెవిరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు గ్రామానికి చేరుకున్నారు. వైసీపీ కేడర్‌తో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి కూడా ఎన్ఆర్ కమ్మపల్లికి చేరుకోవడంతో… గ్రామంలో టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది.

డీఐజీ క్రాంతి రాణా టాటాతో కలిసి తిరుపతి అర్బన్ ఎస్పీ అన్భురాజన్ ఎన్ఆర్ కమ్మపల్లికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. టీడీపీ, వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, టీడీపీ అభ్యర్ధి నానిని పోలీసులు అక్కడి నుంచి తరలించారు. 19న చంద్రగిరి నియోజకవర్గంలో జరిగే రీ పోలింగ్‌ను కొంతమంది అడ్డుకోవాలని చూస్తున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. దాడులకు కూడా పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఓటు హక్కు వినియోగించుకో కూడదంటూ ఆంక్షలు విధిస్తున్నారని చెవిరెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *