చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

Chandrababu House, చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ దాదాపుగా చివరకు వచ్చేసింది. ఇప్పటికే 17 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ.. 133 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా సెక్యూరిటీ అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *