కాశ్మీర్ ఇంకా ఉద్రిక్తం.. మళ్ళీ నిషేధాజ్ఞల విధింపు

TENSION CONTINUE IN JAMMU AND KASHMIR, కాశ్మీర్ ఇంకా ఉద్రిక్తం.. మళ్ళీ నిషేధాజ్ఞల విధింపు

జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి ఇంకా నివురు గప్పిన నిప్పుమాదిరే ఉంది. శనివారం నుంచి మొదలైన ఉద్రిక్తత ఆదివారం కూడా కొనసాగింది. నిన్న రాత్రి ఆ రాష్ట్రం లోని ఓల్డ్ సిటీ సహా అనేకచోట్ల హింసాత్మక ఘటనలు, అల్లర్లు జరిగాయి. పోలీసులు, జవాన్లతో స్థానిక గుంపులు పలు ప్రాంతాల్లో ఘర్షణలకు దిగాయి. వారిని అదుపు చేసేందుకు భద్రతా దళాలు లాఠీ చార్జీ చేశారు. రబ్బర్ బులెట్లను ప్రయోగించారు. ఈ ఘటనల్లో సుమారు రెండు డజన్ల మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వీరిలో పలువురిని ఆస్పత్రుల్లో చేర్చారు. సైనికులపైనా, పోలీసులపైనా ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో వారిలో కొంతమంది గాయపడ్డారు. శ్రీనగర్ లో సోమవారం సుమారు 195 స్కూళ్ళు తెరచుకోవలసి ఉండగా 95 స్కూళ్ళు మాత్రమే తెరిచారు. రాష్ట్రంలో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉండడంతో తలిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి విముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మళ్ళీ నిషేధాజ్ఞలు విధించింది. ఇంటర్నెట్ తదితర సామాజిక మాధ్యమాలఫై విధించిన ఆంక్షలను ఎత్తివేసినప్పటికీ తాజా ఘటనల కారణంగా తిరిగి వీటిపై ఆంక్షలు విధించారు. ఈ నెల 5 న కేంద్రం జమ్మూకాశ్మీర్ ప్రజలకు స్వయం నిర్ణయాధికారానికి వీలు కల్పించే 370 అధికరణాన్ని రద్దు చేసింది. అలాగే మాజీ సీఎంలు మెహబూబా ముప్తీ, ఫరూక్ అబ్దుల్లా సహా అనేకమందిని హౌస్ అరెస్టు చేయడంతో అప్పటి నుంచే కాశ్మీర్ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటు-సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడంతో.. ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు క్షణమొక యుగంగా గడుపుతున్నారు.

TENSION CONTINUE IN JAMMU AND KASHMIR, కాశ్మీర్ ఇంకా ఉద్రిక్తం.. మళ్ళీ నిషేధాజ్ఞల విధింపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *