ఉమ్మడి ఆదిలాబాద్ ఏజెన్సీలో భయానక వాతావరణం.!

ఉమ్మడి ఆదిలాబాద్ ఏజెన్సీలో భయానక వాతావరణం నెలకొంది. కడంబ, పూసుగుప్ప, దేవర్లగూడ, చర్ల ఎన్‌కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు నేడు(సోమవారం) బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ పరిస్థితి తెలెత్తింది. మావోల బంద్ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర – ప్రాణహిత – తెలంగాణ సరిహద్దులో పోలీస్ సోదాలు కొనసాగుతున్నాయి. మావోల బంద్ నేపథ్యంలో తిర్యాణీ, పెంబి, కవ్వాల్, కడంబ అడవుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఏ క్షణాణ ఏం జరుగుతుందో తెలియక […]

ఉమ్మడి ఆదిలాబాద్ ఏజెన్సీలో భయానక వాతావరణం.!
Follow us

|

Updated on: Sep 28, 2020 | 8:27 AM

ఉమ్మడి ఆదిలాబాద్ ఏజెన్సీలో భయానక వాతావరణం నెలకొంది. కడంబ, పూసుగుప్ప, దేవర్లగూడ, చర్ల ఎన్‌కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు నేడు(సోమవారం) బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ పరిస్థితి తెలెత్తింది. మావోల బంద్ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర – ప్రాణహిత – తెలంగాణ సరిహద్దులో పోలీస్ సోదాలు కొనసాగుతున్నాయి. మావోల బంద్ నేపథ్యంలో తిర్యాణీ, పెంబి, కవ్వాల్, కడంబ అడవుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఏ క్షణాణ ఏం జరుగుతుందో తెలియక సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కడంబ ఎన్ కౌంటర్ ను ఖండిస్తూ బూటకపు ఎన్ కౌంటర్ కు ప్రతికారం తీర్చుకుంటామంటూ జగన్ పేరిట విడుదలైన లేఖతో పోలీసులు‌ మరింత అప్రమత్తమయ్యారు.

మావోలు అవాంచనీయ ఘటనలకు పాల్పడవచ్చన్న నిఘా వర్గాలు హెచ్చరికల నేపథ్యంలో గ్రే హౌండ్స్ బలగాలు పెంచారు. బెజ్జూర్, పెంచికల్ పేట, కోటపల్లి, వేమనపల్లి, గూడెం – అహేరీ, అర్జునగుట్ట – సిర్వంచ మధ్య రాకపోకలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డ్రోన్ కెమెరాల సాయంతో సరిహద్దు ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల బంద్ నేపథ్యం లో ప్రాణహిత, పెనుగంగా తో పాటు తెలంగాణ, మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల నిఘా కొనసాగుతోంది. ఇలాఉంటే, కడంబ ఎన్ కౌంటర్ ‌నుండి తప్పించుకున్న మంగిదళ సభ్యుల కోసం పదిరోజులుగా పోలీసులు అడవులను జల్లెడ పడుతున్న సంగతి తెలిసిందే.