రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రయాణికుల ఇక్కట్లు

రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సరిద్దులోని ఆంధ్రావాసులు ఆందోళన చేస్తున్నారు. పొందుగల చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ నుండి వస్తున్న వారిని ఏపి పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ ఇచ్చిన అనుమతి పత్రాలతో బోర్డర్..

రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రయాణికుల ఇక్కట్లు
Follow us

| Edited By:

Updated on: May 03, 2020 | 12:11 PM

రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సరిద్దులోని ఆంధ్రావాసులు ఆందోళన చేస్తున్నారు. పొందుగల చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ నుండి వస్తున్న వారిని ఏపి పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ ఇచ్చిన అనుమతి పత్రాలతో బోర్డర్ దాటేందుకు ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసుల తీరుపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత ఊర్లకు ఎందుకు వెళ్ళనివ్వరంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు ప్రయాణీకులు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఆంధ్రా-తెలంగాణ బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద వలస కూలీలు ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ నుండి ఆంధ్రాకి వెళ్తున్న వలసకూలీలను ఏపీ పోలీసులు అడ్డుకోని ఇళ్లకు వెళ్ళడానికి అనుమతించడం లేదు. దీంతో 200 మంది వలస కూలీలు రాత్రి 12 గంటల నుండి తిండి నిద్ర లేకుండా చిన్న పిల్లలతో పడిగపులు పడుతున్నట్లు వలస కూలీలు పేర్కొంటున్నారు.

Read More:

గుడ్‌న్యూస్: ఉద్యోగులకు, వ్యాపారులకు ‘కరోనా లోన్’

బాలీవుడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ.. ప్రముఖ దర్శకుడితో సినిమా!