Crime News: టీవీ సౌండ్ ఎఫెక్ట్.. ఓనర్ ప్రాణం హాంఫట్..

టీవీ సౌండ్ వివాదం.. ఏకంగా ఓనర్ ప్రాణాలు పోయేలా చేసింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగింది. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు ఏకంగా ఓనర్‌పై దాడి చేసి హత్య..

Crime News: టీవీ సౌండ్ ఎఫెక్ట్.. ఓనర్ ప్రాణం హాంఫట్..
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 25, 2020 | 6:04 PM

Crime News: టీవీ సౌండ్ వివాదం.. ఏకంగా ఓనర్ ప్రాణాలు పోయేలా చేసింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగింది. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు ఏకంగా ఓనర్‌పై దాడి చేసి హత్య చేశాడు ఓ వ్యక్తి. ప్రస్తుతం స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. బాలనర్సయ్య దంపతులు కొత్తగా.. ఆర్మూర్‌లోని గోల్‌‌బంక్ ప్రాంతంలో ఉన్న రాజేందర్ దంపతుల ఇంట్లో అద్దెకు దిగారు. మొదట్లో బాలనర్సయ్య దంపతులు అన్యోన్యంగా ఉన్నా.. గత కొద్దిరోజుల నుంచి గొడవలు జరగడం మొదలయ్యాయి. అవి మరీ ఎక్కువ కావడంతో.. ఇంటి పక్కనే ఉన్న యజమాని రాజేందర్ తీరు మార్చుకోవాలని సూచించారు. అయినా తీరు మారలేదు. షరా మామూలుగానే శుక్రవారం రాత్రి కూడా గొడవపడ్డారు. దీంతో.. విసుగుపోయినా రాజేందర్.. టీవీ సౌండ్ పెంచారు. అలా టీవీలో లీనమైయ్యింది రాజేందర్ ఫ్యామిలీ.

ఈ లోపు బాలనర్సయ్య.. వచ్చి టీవీ సౌండ్ ఎందుకు పెంచారు? అని గొడవ దిగాడు. అలా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఇంకేముంది కోపంతో ఊగిపోతూ.. బాల నర్సయ్య కర్రతో.. రాజేందర్ తలపై కర్రతో బలంగా కొట్టాడు. దీంతో రాజేందర్ ఒక్కసారిగా కింద కుప్పకూలిపోయాడు. తలకి బలమైన దెబ్బ తగలడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఇదంతా చూసి భయమేసిన బాల నర్సయ్య వెంటనే ఇంటినుంచి పరారయ్యాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాల నర్సయ్య కోసం గాలిస్తున్నారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..