కోవిడ్ 19 మూలాల పరిశోధనకు చైనా చేరిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం, వూహాన్ లో ఇక అధ్యయనం

ఇప్పటికీ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్ 19 మూలాలను కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన 10 మంది నిపుణుల బృందం గురువారం చైనా చేరింది..

  • Umakanth Rao
  • Publish Date - 1:05 pm, Thu, 14 January 21
కోవిడ్ 19 మూలాల పరిశోధనకు చైనా చేరిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం, వూహాన్ లో ఇక అధ్యయనం

ఇప్పటికీ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్ 19 మూలాలను కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన 10 మంది నిపుణుల బృందం గురువారం చైనా చేరింది. ఈ శాస్త్రజ్ఞులంతా ఇక ఈ దేశంలోని వూహాన్ సిటీ చేరుకుని అక్కడి చైనీస్ రీసెర్చర్లతో కమ్యూనికేట్ అవుతారు. అది కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ! అయితే చైనా ప్రొటొకాల్స్ ప్రకారం వీరు మొదట అన్ని కోవిడ్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే 14 రోజుల క్వారంటైన్ కూడా తప్పనిసరి అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. క్వారంటైన్ లో ఉన్నా ఈ నిపుణులు ఎప్పటికప్పుడు డ్రాగన్ కంట్రీ శాస్త్రజ్ఞులతో సంప్రదింపులు జరుపుతారు.  (తాము చైనాకు ఓ నిపుణుల బృందాన్ని పంపుతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత ఏడాది మే నెలలోనే ప్రకటించిన విషయం గమనార్హం.) కరోనా వైరస్ వూహాన్ సిటీ నుంచే పుట్టిందని ప్రపంచ దేశాలు నేటికీ గగ్గోలు పెడుతున్నాయి. అమెరికా అయితే చాలాసార్లు ఈ ఆరోపణ చేసింది. కానీ చైనా దీన్ని ఖండిస్తూ వస్తోంది.

ఇలా ఉండగా చైనాలో తాజాగా 138 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 124 కేసులు లోకల్ గాను, మిగతావి బయటి నుంచి ట్రాన్స్ మిట్ అయినట్టు గుర్తించారు. తమ దేశంలో ఈ మహమ్మారిని పూర్తిగా అణచివేశామని గొప్పలు చెప్పుకున్న చైనా ఇప్పుడు కాస్త తటపటాయిస్తోంది.