‘టెంపుల్‌ మౌంట్‌’ కోసం ఆ రెండు దేశాలు…

Temple Mount Clashes: Jordan Condemns 'Blunt' Israeli Violations as Jews Allowed in Holy Site

టెంపుల్‌ మౌంట్‌ అనే పవిత్ర పర్వతం మాదంటే మాదంటూ ఇజ్రాయెల్‌, పాలస్తీనా దేశాలు కొట్టుకుంటున్నాయి. దీంతో ఇరుదేశాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఇస్లాం పవిత్ర దినాలలో ఒకటైన ఈద్‌ అల్‌ అదాను జరుపుకోవడానికి దాదాపు 80,000 మంది పాలస్తీనా ముస్లింలు పాత జెరూసలేంలోని టెంపుల్‌మౌంట్‌కు చేరుకొని ప్రార్థనలు నిర్వహించారు. ఇజ్రాయెల్‌కు చెందిన యూదులకు కూడా ఇదే రోజు టిషాబీఆవ్‌ అనే పండుగ ఉండటంతో వారు సైతం కొండ ప్రాంతానికి చేరుకున్నారు. వారిని కొండపైకి ఇజ్రాయెల్‌ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉగ్రవాదానికి సహకరిస్తున్నారా అంటూ గట్టిగా నినాదాలు చేశారు.

అయితే, టెంపుల్ మౌంట్ ప్రాంత ప్రవేశద్వారం వద్ద హమాస్ పార్టీకి చెందిన నాయకులతోపాటు ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు, ముస్లిం బ్రదర్‌హుడ్‌ నాయకుడు మొహమ్మద్ మోర్సీ ఫోటోలతో కూడిన పెద్ద బ్యానర్ ఉండటం యూదులను ఇంకా ఆగ్రహానికి గురిచేసింది. కొందరు రాడికల్‌ యూదులు కొండపై ఉండే అల్-అక్సా మసీదును ముట్టడించాలని పిలుపునిచ్చారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ పెరిగి హింస చెలరేగడంతో ఇజ్రాయెల్ పోలీసులు జోక్యం చేసుకున్నారు. పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతోపాటు బాష్పవాయువును ప్రయోగించడంతో  చాలామంది గాయపడ్డారు. కాగా, మక్కా వార్షిక తీర్థయాత్రల ముగింపును సూచించే ఈద్ అల్ అదా పండుగను జరుపుకొనే పవిత్ర ప్రాంతంగా టెంపుల్‌మౌంట్‌ను ముస్లింలు భావించగా, చరిత్రలో యూదులు ఎదుర్కొన్న విపత్తులను స్మరించుకుంటూ, దాడుల్లో నాశనం అయిన కొండప్రాంతంపై గల రెండు పురాతన జెరూసలేం దేవాలయాలను తలుచుకొని.. రెండు రోజుల సంతాపం దినంగా  టిషాబీ ఆవ్‌ అనే పండుగను ఇజ్రాయెల్‌ ప్రజలు జరుపుకుంటారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *