Breaking News
  • టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఓటరు నమోదు ఇంచార్జి లతో మాట్లాడిన కేటీఆర్. అక్టోబర్ 1 నుంచి జరగబోయే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదునకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన  కేటీఆర్.
  • బెంగుళూరు అల్లర్ల కేసులో సయ్యద్ సాదిక్ అలీని అరెస్ట్ చేసిన ఎన్ ఐ ఎ. ఆగస్టు 11న డీజే హాలి, కేజీ హాలీ పోలీస్ స్టేషన్ల పై దాడి లతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై అల్లరి మూకల విధ్వంసం. ఈ దాడి వెనకాల ఉన్న సయ్యద్ సాదిక్ అలీ ని అరెస్ట్ చేసిన ఎన్ ఐ ఎ. బెంగళూరులో ఓ బ్యాంకు రికవరీ ఏజెంట్ గా పనిచేస్తున్న సయ్యద్ సాదిక్ అలీ. ఆగస్టు 11 అల్లర్లు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సయ్యద్. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సెప్టెంబర్ 21న బెంగళూరు అల్లర్ల పై కేసు నమోదు చేసిన ఎన్ ఐ ఎ. ఈరోజు బెంగళూరులో 30 చోట్ల సోదాలు నిర్వహించిన ఎన్ ఐ ఏ. సోదాల్లో ఎయిర్ గన్, షార్ప్ ఆయుధాల తో పాటు, ఐరన్ రోడ్స్ ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్న ఎన్ ఐఎ.
  • ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కి కోరిన పాజిటివ్. నిన్నటి నుండి బీజేపీ తలపెట్టిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న విష్ణువర్ధన్ రెడ్డి.
  • ఏసీబీ అధికారులకు మాజీమంత్రి అయ్యన్న, ఎమ్మెల్యే వెలగపూడి ఫిర్యాదు. మంత్రి జయరాంపై ఫిర్యాదు చేసిన అయ్యన్నపాత్రుడు, వెలగపూడి. మంత్రి జయరాం, ఆయన కుమారుడిపై ఫిర్యాదు చేశాం. ఆధారాలుంటే చూపించండి రాజీనామా చేస్తామని జయరాం అన్నారు. అన్ని ఆధారాలు చూపించా-మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు. ఏసీబీ ప్రభుత్వం కంట్రోల్‌లో ఉంది. న్యాయం జరగకపోతే గవర్నర్‌ను కలుస్తాం-అయ్యన్నపాత్రుడు.
  • ముంబై బయలుదేరిన రకుల్ . ncb ముందు హాజరవడానికి కాసేపటి కిందట హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన నటి రకుల్ ప్రీత్ సింగ్. రేపు ఎన్ సి బి ముందు విచారణకు రానున్న రకుల్.
  • కర్నూలు జిల్లా: శ్రీశైలంలోని ఘంటా మఠంలో మరో అద్భుతం. ఘంటా మఠం పునర్నిర్మాణ పనుల్లో బయట పడిన 6 అడుగుల ధ్యాన మందిరం. ధ్యాన మందిరం లోపలి భాగంలో వైవిధ్యంగా ఉన్న సొరంగం. ధ్యాన మందిరం లోపల నైరుతి భాగం నుంచి ఆగ్నేయం వరకు, ఆగ్నేయం మార్గం నుంచి తూర్పు వరకు సొరంగం ఉన్నట్లు గుర్తించిన దేవస్థానం అధికారులు. పది రోజుల క్రితమే ఘంటా మఠంలో బయటపడిన వెండి నాణేలు, తామ్ర శాసనాలు. ధ్యాన మందిరాన్ని యథావిధిగా పునర్నిర్మిస్తాం : ఈవో రామారావు.
  • రేపట్నుంటి సిటీబస్సులు - మంత్రి పువ్వాడ అజయ్. 25 శాతం బస్సులు నడిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకారం - మంత్రి పువ్వాడ అజయ్.

ఏపీ సీఎంకు గుడి కడుతున్నారు..

temple is being built for the ap cm jagan, ఏపీ సీఎంకు గుడి కడుతున్నారు..

అభిమాన హీరోయిన్లకు గుడులు క‌ట్టే క‌ల్చ‌ర్ త‌మిళ‌నాడులో ఉంది. త‌మిళ తంబీలు బొద్దుగా ఉండే అందాల తారాలకు ఫిదా అయిపోయి వెంట‌నే గుడులు క‌ట్టేస్తారు. ఖుష్బూ, న‌మిత‌ల‌కు ఇప్ప‌టికే ప‌లుచోట్ల గుడులు కట్టేశారు. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌కి సైతం గుడి క‌ట్టించేందుకు అప్ప‌ట్లో ప్లాన్ వేసినా తలైవా వారించ‌డంతో ఆగిపోయారు. అయితే తెలుగునాట ఈ క‌ల్చ‌ర్ లేనేలేదు. హీరోల్ని, హీరోయిన్ల‌ను పిచ్చిగా అభిమానిస్తారు కానీ, మ‌రీ గుడులు క‌ట్టి పూజ‌లు చేసేంత పీక్‌లో పిచ్చి లేదు.

అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు కూడా గుడి కట్టేందుకు అడుగులు పడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ నేతలు కట్టిస్తున్నారు. గోపాలపురం మండలం రాజంపాలెంలో ఈ గుడి నిర్మాణానికి ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శంకుస్థాపన కూడా చేశారు. సీఎం జగన్‌ సంక్షేమ పథకాలు భవిష్యత్‌లో కూడా గుర్తుండి పోయేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా వైసీపీ నేత కురకూరి నాగేశ్వర్‌రావు చెప్పుకొచ్చారు.

జగన్‌ సంక్షేమ పథకాలను గుర్తుచేసుకుంటూ ఆయనను ఒక దేవుడిలా కొలవాలనే ఉద్దేశ్యంతోనే కోవెల కడుతున్నట్లు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చెప్పారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం దేశంలో ఎవరూ చేయని విధంగా వేల కిలోమీటర్లు రాజశేఖర్‌రెడ్డి, జగన్‌ పాదయాత్ర చేశారని గుర్తుచేశారు.

వై.ఎస్. ఫ్యామిలీ కారణ జన్ములని, ప్రజలకు సేవ చేయాలనే ఆ కుటుంబాన్ని దేవుడు భూమి మీదకు పంపాడని వైసీపీ నేత కురుకూరి నాగేశ్వర్‌రావు తెలిపారు. జగన్‌ చెంతకు ఏ దుష్ట శక్తులు చేరకూడదనే లక్ష్యంతోనే గుడి నిర్మిస్తున్నట్లు వివరించారు.

Related Tags