బోర్డర్‌లో బెంబేలెత్తిన తెలుగు విద్యార్థులు

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి చేసిన కృషి ఫలించి వారంతా కరోనా వైరస్ ప్రబలిన ప్రస్తుత పరిస్థితుల్లోనూ వారు విదేశాల నుంచి తిరిగి భారతదేశానికి చేరుకున్నారు ఇదంతా ఒక ఎత్తైతే.. ఇప్పుడు వారంతా తెలుగు రాష్ట్రాల్లోని తమ స్వస్థలాలకు చేరుకోవడం పెద్ద గగనమైపోయింది.

బోర్డర్‌లో బెంబేలెత్తిన తెలుగు విద్యార్థులు
Follow us

|

Updated on: Apr 27, 2020 | 3:16 PM

వాళ్లంతా కొన్ని వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఇచ్చారు.. మామూలు రోజుల్లో వేల కిలోమీటర్లు ప్రయాణం చేయడం పెద్ద విషయం ఏమీ కాదు కానీ కరోనా వైరస్ ప్రబలిన ప్రస్తుత పరిస్థితుల్లో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి రావడం అనేది గొప్ప విషయమే. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి చేసిన కృషి ఫలించి వారంతా కరోనా వైరస్ ప్రబలిన ప్రస్తుత పరిస్థితుల్లోనూ వారు విదేశాల నుంచి తిరిగి భారతదేశానికి చేరుకున్నారు ఇదంతా ఒక ఎత్తైతే.. ఇప్పుడు వారంతా తెలుగు రాష్ట్రాల్లోని తమ స్వస్థలాలకు చేరుకోవడం పెద్ద గగనమైపోయింది. కారణం కేంద్రం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు సరేనా సమాచారం లేకపోవడం వల్లనే.

కరోనా వైరస్ విపరీతంగా ప్రభావం చూపిన ఇటలీ దేశంలో చిక్కుకు పోయిన భారతీయులను తిరిగి మన దేశానికి రప్పించేందుకు విదేశాంగ శాఖ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొత్తం 163 మంది ఇటలీలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు ఢిల్లీకి తిరిగి వచ్చారు. అందులో 70 మంది తెలుగు విద్యార్థులున్నారు. అయితే వారందరూ క్వారెంటైన్ పీరియడ్ ముగిసిన తర్వాతనే తమ స్వస్థలాలకు వెళ్లాలని కేంద్రం నిర్దేశించింది అందులో భాగంగా వారంతా ఢిల్లీలోని క్వారెంటైన్ సెంటర్లలో నిర్దిష్ట గడువును పూర్తి చేసుకున్నారు. అనంతరం వారందరికీ కరోనా వైరస్ నెగటివ్ రావడంతో తమ స్వస్థలాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జారీచేసిన ప్రత్యేక ధ్రువీకరణ పత్రాలు తీసుకుని బయలుదేరారు. ప్రత్యేక వాహనాల్లో ఢిల్లీ నుంచిఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలను దాటుకుని తెలంగాణ సరిహద్దుకు చేరుకున్న తెలుగు విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్ర సరిహద్దులో అడ్డుకున్నారు.

కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్ర స్థాయి అధికారులకు సమాచారం అందలేదో.. లేక రాష్ట్ర స్థాయి అధికారులు కింది లెవెల్లో చెక్ పోస్టు సిబ్బందికి సమాచారం ఇవ్వలేదో గానీ.. తెలంగాణ మహరాష్ట్ర సరిహద్దుల్లో ఇటలీ నుంచి వచ్చిన విద్యార్థులు ఆగిపోయారు. ఇటలీ నుండి వచ్చి ఢిల్లీలో క్వారంటెన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రయాణిస్తున్న మూడు బస్సులను నిలిపి వేసారు తెలంగాణ పోలీసులు. ఢిల్లీలో క్వారంటైన్ పూర్తి చేసుకోని తిరిగి వస్తుండగా అనుమతి లేదని ఆపేసారు తెలంగాణ (ఆదిలాబాద్ జైనాథ్ )పోలీసులు.

రిటైర్డ్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తుల వాహనాలు నిలిపివేసి, ఉన్నతాధికారులకు నివేదించారు. వారి అనుమతి కోసం ఎదురుచూసినంతసేపు ఇటలీ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థులు, మహారాష్ట్ర సరిహద్దుల్లో రోడ్లపై పడిగాపులు కాయాల్సి వచ్చింది. తెలుగు విద్యార్థులు వారి పరిస్థితిని ఎంతగా వివరించిన ఉన్నతాధికారుల అనుమతి లేనిదే రాష్ట్రంలోకి అనుమతించబోమని చెక్‌పోస్టు సిబ్బంది ఖరాఖండిగా చెప్పడంతో తెలుగు విద్యార్థులు చేసేదేమీలేక గంటల తరబడి రోడ్డుపై పడిగాపులు కాశారు. చివరికి ఉన్నత అధికారుల అనుమతితో సుమారు 70 మంది తెలుగు విద్యార్థులను రాష్ట్రంలోకి అనుమతించారు. మొత్తం 70 మంది విద్యార్థులు రాగా.. వీరిలో కొంతమంది తెలంగాణ విద్యార్థులు మరికొంత మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగు విద్యార్థులను అదే ప్రత్యేక బస్సులో విజయవాడకు తరలించారు.

క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...