మూడు రోజుల్లో భారీ వర్షాలు

రాగల మూడు రోజుల్లో ఏపీ,తెలంగాణాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలతో 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం నుంచి పలు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణాలో తేలికపాటినుంచి ఓ మోస్తరు వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.అదే విధంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:18 pm, Sun, 28 July 19

రాగల మూడు రోజుల్లో ఏపీ,తెలంగాణాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలతో 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం నుంచి పలు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణాలో తేలికపాటినుంచి ఓ మోస్తరు వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.అదే విధంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సైతం తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.