తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన…

తెలంగాణలో వరుసగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు,మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయని తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్, యాదాద్రి, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, గద్వాల జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి […]

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన...
Follow us

|

Updated on: Jun 03, 2020 | 7:19 AM

తెలంగాణలో వరుసగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు,మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయని తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్, యాదాద్రి, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, గద్వాల జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లో…

మరో వైపుల ఏపీలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుదని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో ఎక్కువ చోట్ల, కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని ప్రకటించింది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్తితి కొనసాగుతుందని వెల్లడించింది.