తెలుగు రాష్ట్రాల్లో సందడిగా సంక్రాంతి..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారు జామునే భోగి మంటలు వేసుకుని.. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులతో గొబ్బెమ్మలను అలంకరించి.. లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.సంక్రాంతి పర్వదినం తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని ఆశాభావంతో ఉన్నారు. హైదరాబాద్ నగరంలో తెల్లవారు జామునే ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులతో గొబ్బెలతో అలంకరించారు. మరోవైపు చిన్నా, పెద్ద తేడాలేకుండా.. అంతా పతంగులను ఎగరవేస్తున్నారు. మరోవైపు సౌండ్ బాక్స్‌లను పెట్టుకుని విజిల్స్ వేస్తూ […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:50 am, Wed, 15 January 20

తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారు జామునే భోగి మంటలు వేసుకుని.. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులతో గొబ్బెమ్మలను అలంకరించి.. లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.సంక్రాంతి పర్వదినం తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని ఆశాభావంతో ఉన్నారు. హైదరాబాద్ నగరంలో తెల్లవారు జామునే ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులతో గొబ్బెలతో అలంకరించారు. మరోవైపు చిన్నా, పెద్ద తేడాలేకుండా.. అంతా పతంగులను ఎగరవేస్తున్నారు. మరోవైపు సౌండ్ బాక్స్‌లను పెట్టుకుని విజిల్స్ వేస్తూ డాన్సులు చేస్తున్నారు.

కాగా, గ్రామీణ ప్రాంతాల వారు ఇప్పటికే నగరాన్ని విడిచి.. పల్లెలకు తరలిపోయారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పల్లెలన్నీ పండగ వాతావరణంతో సందడిగా మారిపోయాయి. తెల్లవారుజామునే చలిమంటలు కాచుకుంటూ.. చిన్నా పెద్ద ఏంజాయ్ చేస్తుంటే.. మరికొందరు కోడి పందేలలో బిజీబిజీగా గడిపేస్తున్నారు. మరో వైపు బండలాగుడు పోటీలు కూడా ఆసక్తిని రేపుతున్నాయి.