‘ఇంటర్నేషనల్‌ మెన్స్‌డే’ సెలబ్రేషన్‌లో టాలీవుడ్‌ దర్శకులు.. పార్టీ ఇచ్చిన తరుణ్ భాస్కర్‌

గురువారం అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరిగిన విషయం తెలిసిందే. దాన్ని పురస్కరించుకొని పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్‌ ఓ పార్టీని ఇచ్చారు

  • Manju Sandulo
  • Publish Date - 2:18 pm, Sat, 21 November 20

International Men’s Day: గురువారం అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరిగిన విషయం తెలిసిందే. దాన్ని పురస్కరించుకొని పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్‌ ఓ పార్టీని ఇచ్చారు. ఈ పార్టీకి పలువురు యువ దర్శకులు హాజరయ్యారు. ఇక ఈ పార్టీ గురించి క్షణం, కృష్ణ అండ్‌ హిజ్‌ లీల దర్శకుడు రవికాంత్‌ పేరేపు తన సోషల్ మీడియాలో తెలిపారు. ”తరుణ్‌ మా అందరికి గత రాత్రి మంచి పార్టీ ఇచ్చాడు. ఇంటర్నేషనల్‌ మెన్స్‌డే సెలబ్రేషన్స్” అంట అని రవికాంత్‌ కామెంట్‌ పెట్టారు. ఇక ఆ ఫొటోలో అ! దర్శకుడు ప్రశాంత్ వర్మ, అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ, కేరాఫ్‌ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య దర్శకుడు వెంకటేష్ మహా, మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తదితరులు ఉన్నారు.