ఎక్కువ భాషల్లో రీమేక్.. మన తెలుగు సినిమాకే ఆ రికార్డ్

ఒక భాషలో పెద్ద విజయం సాధించిన చిత్రం మరో భాషలో రీమేక్ అవ్వడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. మన తెలుగులో కూడా అలాంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇక తెలుగు నుంచి పలు చిత్రాలు మిగిలిన భాషల్లో రీమేక్ అయ్యాయి. అయితే ఇప్పటివరకు అత్యధిక భారతీయ భాషల్లో రీమేక్ అయిన చిత్రం ఏదో తెలుసా.. అది కూడా మన తెలుగు సినిమానే కావడం విశేషం. ఇంతకు ఆ చిత్రం ఏంటంటే.. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’.. తెలుగుతో పాటు ఈ […]

ఎక్కువ భాషల్లో రీమేక్.. మన తెలుగు సినిమాకే ఆ రికార్డ్
Follow us

| Edited By:

Updated on: Sep 10, 2019 | 7:03 PM

ఒక భాషలో పెద్ద విజయం సాధించిన చిత్రం మరో భాషలో రీమేక్ అవ్వడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. మన తెలుగులో కూడా అలాంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇక తెలుగు నుంచి పలు చిత్రాలు మిగిలిన భాషల్లో రీమేక్ అయ్యాయి. అయితే ఇప్పటివరకు అత్యధిక భారతీయ భాషల్లో రీమేక్ అయిన చిత్రం ఏదో తెలుసా.. అది కూడా మన తెలుగు సినిమానే కావడం విశేషం. ఇంతకు ఆ చిత్రం ఏంటంటే.. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’.. తెలుగుతో పాటు ఈ చిత్రం ఏడు భారతీయ భాషల్లో రీమేక్ అయ్యింది. అంతేకాదు రెండు భారతీయేతర భాషల్లో కూడా నువ్వొస్తానంటే నేనొద్దంటానా రీమేక్ అవ్వడం గమనార్హం.

సిద్ధార్థ, త్రిష, అర్చన, శ్రీహరి, ప్రకాష్ రాజ్, పరచూరి గోపాలకృష్ణ, సునీల్ తదితరులు ప్రధానపాత్రలలో కొరియోగ్రాఫర్ కమ్ డైరక్టర్ ప్రభుదేవా తెరకెక్కించిన చిత్రం నువ్వొస్తానంటే నేనొద్దంటానా. ఎంఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. సన్ ఇన్ లా అనే ఇంగ్లీష్ మూవీ, మైనే ప్యార్ కియా అనే హిందీ మూవీల పోలీకలు ఈ సినిమాలో కనిపించినప్పటికీ.. కొత్త స్క్రీన్‌ప్లేతో ప్రభుదేవా అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాదు ఈ మూవీ ద్వారానే దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రభుదేవా ప్రారంభించడం విశేషం.

స్నేహితురాలి పెళ్లి కోసం హీరోయిన్ వాళ్లింటికి వెళ్లడం.. లండన్‌లో ప్లే బాయ్‌లా పెరిగిన హీరో ఆ పెళ్లికి రావడం.. కొన్ని పరిణామాల తరువాత హీరోయిన్, హీరోతో ప్రేమలో పడటం.. ఈ విషయం తెలిసిన హీరో తల్లి.. హీరోయిన్‌ను, ఆమె సోదరుడిని అవమానించడం.. ఆ తరువాత హీరోయిన్‌ సొంతూరికి తీసుకువెళ్లడం.. ఆమెను వదులుకోలేక హీరో, హీరోయిన్ ఇంటికి రావడం.. అక్కడ హీరోయిన్ సోదరుడు హీరోకు పరీక్ష పెట్టడం.. చివరకు కథ సుఖాంతంగా ముగియడం. ఈ కథాంశం ఆధారంగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా తెరకెక్కింది.

ఇక ఇందులో నటించిన ప్రతి ఒక్కరు తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా తన చెల్లిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే పాత్రలో శ్రీహరి, తన ప్రేమను బతికించుకోవడం కోసం హీరోయిన్ వాళ్లింటికి వెళ్లి రైతుగా పనిచేసే పాత్రలో సిద్ధార్థ జీవించారు. అలాగే చక్కనైన పల్లెటూరి అమ్మాయిగా త్రిష కూడా అద్భుత నటనను కనబరిచింది. వీరితో పాటు గీత, ప్రకాష్ రాజ్, సునీల్, తనికెళ్ల భరణి, జయ ప్రకాష్ రెడ్డి, పరచూరి వేంకటేశ్వర రావు, సంతోషి తదితరులు తమ తమ పాత్రలలో ఒదిగిపోయారు. నటీనటులతో పాటు ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక వర్గం సినిమాకు మరో అస్సెట్‌గా నిలిచారు. వారందరిలో సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రతి పాటలో కొత్తదనాన్ని చూపి కథకు తన మ్యూజిక్‌తో ప్రాణం పోశాడు దేవీ. ఇక ఈ టైటిల్‌ను ఎంఎస్ రాజు నిర్మించిన వర్షం పాటలో నుంచి తీసుకోవడం గమనర్హం.

ఇదిలా ఉంటే ఈ మూవీ తమిళంలో ‘ఉనక్కం ఎనక్కం’.. కన్నడలో ‘నీనెల్లో నానెల్లె’.. ఒరియాలో ‘సున చాదెయ్ మో రుపా చాదెయ్’.. బెంగాలీలో ‘ఐ లవ్ యు’.. హిందీలో ‘రామయ్య వస్తామయ్య’.. పంజాబీలో ‘తేరా మేరా కీ రిస్తా’ అనే టైటిల్‌లతో రీమేక్ అయ్యింది. వీటితో పాటు బంగ్లాదేశీ బెంగాలీలో ‘నిస్సా అమర్ తుమీ’.. నేపాలీలో ‘ఫ్లాష్ బ్యాక్: ఫర్కెరా హెర్దా’ అనే టైటిళ్లతో రీమేక్ అయ్యింది. ఇకతెలుగు, హిందీ భాషలకు ప్రభుదేవానే దర్శకత్వం వహించడం విశేషం. కాగా తెలుగు భాషల్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమా అవార్డుల్లోనూ రికార్డులు సృష్టించింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానాకు ఐదు నంది అవార్డులు రాగా.. తొమ్మిది ఫిలింఫేర్ అవార్డులు, రెండు సంతోషం అవార్డులు దక్కాయి. అంతేకాదు ఇప్పటివరకు ఎక్కువ ఫిలింఫేర్ అవార్డులు పొందిన మూవీ కూడా ఇదే కావడం మరో విశేషం.